RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, సెప్టెంబర్ 2025, బుధవారం

శ్రీ లలిత శివ జ్యోతి | Sri Lalitha Shiva Jyothi | Song Lyrics | Rahashyam (1967)

శ్రీ లలిత శివ జ్యోతి



చిత్రం :  రహస్యం (1967)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  మల్లాది రామకృష్ణశాస్త్రి

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి :


శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా 

సర్వమంగళా

 శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా 

సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా


చరణం 1 :


జగముల చిరునగవుల 

పరిపాలించే జననీ

అనయము మము 

కనికరమున కాపాడే జననీ

జగముల చిరునగవుల 

పరిపాలించే జననీ

అనయము మము 

కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మనసే నీ వశమై స్మరణే జీవనమై

మాయని వరమీయవె 

పరమేశ్వరి మంగళనాయకి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

 

చరణం 2 :


అందరికన్నా చక్కని తల్లికి 

సూర్యహారతి

అందాలేలే చల్లని తల్లికి 

చంద్రహారతి

రవ్వల తళుకుల కళలా జ్యోతుల 

కప్పుర హారతి

సకల నిగమ వినుత చరణ శాశ్వత 

మంగళహారతి

 

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

శ్రీగిరి నిలయా గిరామయా 

సర్వమంగళా

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు