RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, సెప్టెంబర్ 2025, గురువారం

రేపంటి రూపం కంటి | Repanti Roopam Kanti | Song Lyrics | Manchi Chedu (1963)

రేపంటి రూపం కంటి



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ... 


చరణం 1:


నా తోడు నీవైయుంటే.. 

నీ నీడ నేనేనంటి

ఈ జంట కంటే వేరే 

లేదు లేదంటి

నా తోడు నీవైయుంటే.. 

నీ నీడ నేనేనంటి

ఈ జంట కంటే వేరే 

లేదు లేదంటి


నీ పైన ఆశలు వుంచి.. 

ఆపైన కోటలు పెంచి

నీ పైన ఆశలు వుంచి.. 

ఆపైన కోటలు పెంచి


నీకోసం రేపూ మాపూ 

వుంటిని నిన్నంటి

రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


చరణం 2:


నే మల్లెపువ్వై విరిసి.. 

నీ నల్లని జడలో వెలిసి

నీ చల్లని నవ్వుల కలసి 

వుంటే చాలంటి

నే మల్లెపువ్వై విరిసి.. 

నీ నల్లని జడలో వెలిసి

నీ చల్లని నవ్వుల కలసి 

వుంటే చాలంటి


నీ కాలి మువ్వల రవళి.. 

నా భావి మోహన మురళీ

నీ కాలి మువ్వల రవళి.. 

నా భావి మోహన మురళీ

ఈ రాగ సరళి తరలి 

పోదాం రమ్మంటి


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ... 


చరణం 3:


నీలోని మగసిరితోటి నాలోని 

సొగసులు పోటి

వేయించి నేనే ఓడిపోనీ 

పొమ్మంటి

నేనోడి నీవే గెలిచి నీ గెలుపు 

నాదని తలచి

రాగాలు రంజిళ్లు రోజే 

రాజీ రమ్మంటి...


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ...

రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు