RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

తెలుసుకొనవే చెల్లి | Telusukonave Chelli | Song Lyrics | Missamma (1955)

తెలుసుకొనవే చెల్లి



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


తెలుసుకొనవే చెల్లి.. 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


మగవారికి దూరముగ 

మగువలెపుడు మెలగాలని

మగవారికి దూరముగ 

మగువలెపుడు మెలగాలని

తెలుసుకొనవే చెల్లి.. 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


చరణం 1:


మనకు మనమె వారికడకు 

పని ఉన్న పోరాదని ...  ఆ...  ఆ...

మనకు మనమె వారికడకు 

పని ఉన్న పోరాదని

అలుసు చేసి నలుగురిలో 

చులకనగ చూసెదరని

అలుసు చేసి నలుగురిలో 

చులకనగ చూసెదరని


తెలుసుకొనవే చెల్లి... 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి


చరణం 2:


పదిమాటలకొక మాటయు 

బదులు చెప్పకూడదని ... ఆ... ఆ...

పదిమాటలకొక మాటయు 

బదులు చెప్పకూడదని

లేని పోని అర్థాలను 

మన వెనుకనె చాటెదరని

లేని పోని అర్థాలను 

మన వెనుకనె చాటెదరని


తెలుసుకొనవే చెల్లి... 

అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు