RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

బృందావనమది అందరిది | Brindavanamadi Andaridi | Song Lyrics | Missamma (1955)

బృందావనమది అందరిది



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా, సుశీల


పల్లవి:


బృందావనమది అందరిది.. 

గోవిందుడు అందరి వాడేలే

బృందావనమది అందరిది.. 

గోవిందుడు అందరి వాడేలే


ఎందుకే రాధా ఈశునసూయలు.. 

అందములందరి ఆనందములే

ఎందుకే రాధా ఈశునసూయలు.. 

అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది.. 

గోవిందుడు అందరి వాడేలే


చరణం 1:


పిల్లన గ్రోవిని పిలుపులు వింటె.. 

ఉల్లము ఝల్లున పొంగదటే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె.. 

ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన 

జగమే ఊయలలూగదటే

రాగములో అనురాగము చిందిన 

జగమే ఊయలలూగదటే


బృందావనమది అందరిది.. 

గోవిందుడు అందరి వాడేలే


చరణం 2:


రాసక్రీడల రమణుని గాంచిన 

ఆశలు మోశులు వేయవటే

రాసక్రీడల రమణుని గాంచిన 

ఆశలు మోశులు వేయవటే

ఎందుకే రాధా ఈశునుసూయలు.. 

అందములందరి ఆనందములే..


బృందావనమది అందరిది.. 

గోవిందుడు అందరి వాడేలే

గోవిందుడు అందరి వాడేలే..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు