RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, మార్చి 2025, మంగళవారం

శృంగార సీమంతిని | Srungara Seemanthini | Song Lyrics | Abhimanyudu (1984)

శృంగార సీమంతిని



చిత్రం :  అభిమన్యుడు (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఆ.. ఆ.. ఆహ.. హా.. అహా..హా..

నిసనిస.. నిసనిగ.. సగ సమా.. ఆ.. ఆ..


శృంగార సీమంతిని...

శృంగార సీమంతిని.. 

నా జీవన మందాకిని

నీ కనుసన్న సైయ్యాటలో.. 

నను జీవించనీ.. మరణించనీ


శృంగార సీమంతిని.. 

నా జీవన మందాకిని

నీ కనుసన్న సైయ్యాటలో.. 

నను జీవించనీ.. మరణించనీ

శృంగార సీమంతిని...  


సరిప.. గమ గమని

సరిప.. పమ గపమ


నిసనిస.. సమగమ


చరణం 1 :


నీ హృదయాన మ్రోగాలని 

రవళించు రాగాన్ని...

నీ గుడిలోన వెలగాలని 

తపియించు దీపాన్ని


నీ పాద కమలాల పారాణిని.. 

నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని

సురలోక వాసిని.. సుమ హాసిని

చిరకాలం ఈ చెలిమి 

చిగురించి పూయని 


శృంగార సీమంతిని.. ఆ.. 

నా జీవన మందాకిని..మ్మ్..

నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. 

నను జీవించనీ.. మరణించనీ... ఆ..


శృంగార సీమంతిని...

పమగా.. మపగగమపగ  సనిని... 

మా.. మపదమపద మా గా గా


సనిని మాగగ


చరణం 2 :


నీ రాయంచ గమనానికి 

పరిచాను పూదారిని

నువు రానున్న శుభవేళకై 

వేచాను ఒంటరిని


విన్నాను నీ కాలి సవ్వడిని

కన్నాను నీ కావి కనుదోయిని

కరుణాంతరంగిని...  అనురాగిని

నీ అలుకే నా పాళి వరముగా పండనీ...


శృంగార సీమంతిని.. ఆ.. 

నా జీవన మందాకిని..మ్మ్..

నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. 

నను జీవించనీ... మరణించనీ... ఆ..


శృంగార సీమంతిని...

ఆ.. అ...ఆ.. ఆ..హ.. ఆ.. హా.. ఆహ. హా..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు