RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, మార్చి 2025, బుధవారం

జగధబి రాముడు శ్రీరాముడే | Jagadabhi Ramudu Sriramude | Song Lyrics | LavaKusa (1963)

జగధబి రాముడు శ్రీరాముడే



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల, లీల, సుశీల


పల్లవి :


జయ జయ రాం జయ రఘురాం 

జయ జయ రాం జయ రఘురాం


జగధబి రాముడు శ్రీరాముడే.. 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే.. 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే.. 


జనకుని మాటన తలపై నిలిపి.. 

తన సుఖముల విడి వనితావణి తో 

వనములకేగిన ధర్మావతారుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే 


చరణం 1 :


కరమున ధనువు శరములు దాలిచి.. 

కరమున ధనువు

ఆ ఆ..ఆ..ఆ.... ఆ ఆ..ఆ..ఆ... ఆ ఆ..ఆ..ఆ

కరమున ధనువు శరములు దాలిచి.. 

ఇరువది చేతుల దొరనే కూలిచి

సురలను గాంచిన వీరాధివీరుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే 


చరణం 2 :


ఆలుమగల అనురాగాలకు 

ఆలుమగల అనురాగాలకు

పోలిక సీతారాములే అనగా..  

పొలిక సీతారాములే అనగా

వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే


నిరతము ధర్మము నెరపీ నిలిపీ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నిరతము ధర్మము నెరపీ నిలిపీ.. 

నరులకు సురలకు తరతరాలకు

ఒరవడి అయినా వర యుగపురుషుడు.. 

జగధబి రాముడు శ్రీరాముడే


చరణం 3 : 


ఇనకులమణి సరితూగే తనయుడు 

అన్నయూ ప్రభువు లేనే లేడని

ఇనకులమణి సరితుగే తనయుడు 

అన్నయూ ప్రభువు లేనే లేడని

జనులు భజించే పురుషోత్తముడు...


జగధబి రాముడు శ్రీరాముడే... 

రఘుకుల సోముడు ఆ రాముడే

జగధబి రాముడు శ్రీరాముడే...

జయ జయ రాం జయ రఘురాం 

జయ జయ రాం జయ రఘురాం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు