RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, మార్చి 2025, మంగళవారం

ఒకే గొడుగు ఒకే అడుగు | Oke Godugu Oke Adugu | Song Lyrics | Abhimanyudu (1984)

ఒకే గొడుగు ఒకే అడుగు



చిత్రం :  అభిమన్యుడు (1984)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా

కలిసి పయనించే స్నేహము.. 

వలపు వర్షించే మేఘము 


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా

కలిసి పయనించే స్నేహము.. 

వలపు వర్షించే మేఘము 


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ..
ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ..


చరణం 1 :


నీలి మబ్బు మెరిసి మెరిసి.. 

నీళ్ళ మనసు మురిసి మురిసి

ఎన్ని జలదరింపులో.. 

ఎన్నెన్ని పులకరింతలో


చినుకు చినుకు కలిసి కలిసి.. 

చెలిమి జల్లు కురిసి కురిసి

ఎన్ని వలపు వరదలో.. 

ఎన్నెన్ని కలల వాగులో 


ఇది భూదేవికి సీమంతం.. 

అనురాగానికి వసంతం

ఇది భూదేవికి సీమంతం.. 

అనురాగానికి వసంతం


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ.. 

ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ..


చరణం 2 :


కన్నె తీగ తడిసి తడిసి.. 

వన్నె మొగ్గ తొడిగి తొడిగి

ఎన్ని పూలపొంగులో.. 

ఎన్నెన్ని రంగవల్లులో 

ఇంద్రధనస్సు పందిరేసి.. 

రంగులేడు ముగ్గులేసి

ఎన్ని మధనపూజలో.. 

ఎన్నెన్ని మరులవిందులో


ఇది ఈ సృష్టికి ఆనందం... 

ఇది మన ఇద్దరి అనుబంధం

ఇది ఈ సృష్టికి ఆనందం... 

ఇది మన ఇద్దరి అనుబంధం


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఒకే ఒకరుగా

కలిసి పయనించే స్నేహము.. 

వలపు వర్షించే మేఘము 


ఒకే గొడుగు.. ఒకే అడుగు.. 

ఒకే నడకగా

ఒకరికొకరుగా.. ఆ... ఆ.. ఆ.. 

ఒకే ఒకరుగా... ఆ... ఆ.. ఆ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు