పువ్వులనడుగు నవ్వులనడుగు
చిత్రం: ఆమె కథ (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: జి. ఆనంద్, సుశీల
పల్లవి:
పువ్వులనడుగు... నవ్వులనడుగు...
పువ్వులనడుగు నవ్వులనడుగు...
రివ్వున ఎగిరే గువ్వలనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో...
ఇది ఏనాటి అనుబంధమో... ఓ... ఓ...
కొమ్మలనడుగు... ఆఁహాఁహాఁహాఁ...
రెమ్మలనడుగు ఆఁహాఁహాఁహాఁ...
కొమ్మలనడుగు రెమ్మలనడుగు...
ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో...
ఇది ఏనాటి అనుబంధమో...
చరణం 1:
పల్లె పదానికి పల్లవినై...ఈ..
పడుచందానికి పల్లకినై...ఈ..
పెదవి పల్లవి కలిపేస్తా...
నా పల్లవి నీలో పలికిస్తా...ఆ..
నీవు నేనుగా పూవు తావిగా....
జన్మ జన్మలకు విడని జంటగా...
నీవే.. నా దీవెనా... ఆ..ఆ..
ఈ పొద్దు చాలక నా ముద్దు తీరగ
రేపన్నదేలేక చెలరేగిపోతా....
పువ్వులనడుగు...
పువ్వులనడుగు నవ్వులనడుగు...
రివ్వున ఎగిరే గువ్వలనడుగు...
నువ్వంటే నాకెంత ప్రేమో...
ఇది ఏనాటి అనుబంధమో...
చరణం 2:
పొడిచే పొద్దుల తూరుపునై...ఈ..ఈ..
వాలే పొద్దుల పడమరనై...ఈ..ఈ..
దిక్కులు నీలో కలిపేస్తా...ఆ..ఆ..
నా దిక్కువి నీవని పూజిస్తా..ఆ..ఆ..
నింగి సాక్షిగా నేల సాక్షిగా...
మమతల మల్లెల మనస్సాక్షిగా...
నీవే నా దేవతా....
ఆ...ఆ...ఆ...
వెయ్యేళ్ల కోరిక నూరేళ్లు చాలక...
ఏడేడు జన్మలు నీదాననౌతా...
కొమ్మలనడుగు...
కొమ్మలనడుగు రెమ్మలనడుగు...
ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు...
నువ్వంటే... నువ్వంటే...
నాకెంత ప్రేమో... ప్రేమో...
ఇది ఏనాటి అనుబంధమో...ఓ...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి