RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, మార్చి 2025, శనివారం

నా జీవన సంధ్యా సమయంలో | Naa Jeevana Sandhya Samayamlo | Song Lyrics | Amara Deepam (1977)

నా జీవన సంధ్యా సమయంలో



చిత్రం :  అమర దీపం (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల   


పల్లవి :

ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... 


నా జీవన సంధ్యా సమయంలో.. 

ఒక దేవత ఉదయించింది

ఆ రూపమే...  అపురూపమై... 

అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో.. 

ఒక దేవత ఉదయించింది


ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... 


చరణం 1 :


శిలకే కదలిక రాగా..  

శిల్పమే కదలి ఆడింది


గరిస..  సదపమ గమద మదని

దనిరిని గరిగరిసా సదసదపా మపగా


కళకే కళగా విరిసి.. 

నా కల నిజమై పండింది

శిలకే కదలిక రాగా 

శిల్పమే కదలి ఆడింది


కళకే కళగా విరిసి 

నా కల నిజమై పండింది

ఆరు ఋతువుల ఆమని కోయిల.. 

మనసే ఎగసి పాడింది


నా జీవన సంధ్యా సమయంలో..

ఒక దేవత ఉదయించింది 


చరణం 2 :


పొద్దుపొడుపులో అరుణిమలే.. 

చెలి దిద్దు తిలకమై చివురించే

ఇంద్రధనుస్సులో రిమరిమలే.. 

చెలి పైట జిలుగులే సవరించే

ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన...

ఆఆఆ..ఆఆ.... ఆఆఆఅ.... ఆ.... ఆఆ...

ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన.. 

వెదురు వేణువై పలికింది


నా జీవన సంధ్యా సమయంలో..

ఒక దేవత ఉదయించింది


చరణం 3 :


పలుకే పాడని పాట...  

చిరునవ్వు పూలకే పూత

గరిసా సదపమా గమద మదని

దనిరిని గరిగరిసా సదసదపా మపగా

నడకే నెమలికి ఆట..  

లే నడుము కలలకే కవ్వింత

కలలుగన్న నా శ్రీమతి రాగా.. 

ఈ బ్రతుకే పరిమళించింది


నా జీవన సంధ్యా సమయంలో.. 

ఒక దేవత ఉదయించింది

ఆ రూపమే అపురూపమై.. 

అమరదీపమై వెలిగింది

నా జీవన సంధ్యా సమయంలో.. 

ఒక దేవత ఉదయించింది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు