RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, ఆగస్టు 2024, మంగళవారం

నిను చూడక నేనుండలేనూ | Ninu Chudaka nenundalenu | Song Lyrics | Neerajanam (1988)

నిను చూడక నేనుండలేనూ



చిత్రం: నీరాజనం (1988) 

సంగీతం: ఓ.పి. నయ్యర్ 

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి : 


ఆ..హాహాహా..ఆ..హాహాహా 

ఓహో ఓహో ఓహో 


నిను చూడక నేనుండలేనూ..ఊ.. 

నిను చూడక నేనుండలేనూ 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 

నిను చూడక నేనుండలేనూ..ఊ.. 

నిను చూడక నేనుండలేనూ 


చరణం 1 : 


ఆ..హాహాహా..ఆ..హాహాహా 

ఆ..హాహాహా ఓ హోహో 

ఆ..హాహాహా ఓ హోహో 

ఓ హోహో ఆ..హాహాహా 


ఏ హరివిల్లు విరబూసినా 

నీ దరహాసమనుకుంటినీ 

ఏ చిరుగాలి కదలాడినా 

నీ చరణాల శృతి వింటినీ 

నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో 

నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో 


నిను చూడక నేనుండలేనూ 

నిను చూడక నేనుండలేనూ 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 

నిను చూడక నేనుండలేనూ..ఊ.. 

నిను చూడక నేనుండలేనూ 


చరణం 2: 


ఓ హోహో ఆ..హాహాహా 

ఆ..హాహాహా..ఆ..హాహాహా 

ఆ..హాహాహా..ఆ..హాహాహా 

ఆ..హాహాహా ఓ హోహో 


నీ జతగూడి నడియాడగా 

జగమూగింది సెలయేరుగా 

ఒక క్షణమైన నిను వీడినా 

మది తొణికింది కన్నీరుగా 

మన ప్రతి సంగమం 

ఎంత హృదయంగమం 

మన ప్రతి సంగమం 

ఎంత హృదయంగమం 


నిను చూడక నేనుండలేనూ..ఊ.. 

నిను చూడక నేనుండలేనూ 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఈ జన్మలో మరి ఆ జన్మలో 

ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 

నిను చూడక నేనుండలేనూ 

నిను చూడక నేనుండలేనూ 

నిను చూడక నేనుండలేనూ..ఊ.. 

నిను చూడక నేనుండలేనూ


- పాటల ధనుస్సు  


1 కామెంట్‌:

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు