జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
చిత్రం - అమ్మ దొంగా (1995 )
సాహిత్యం - వేటూరి
సంగీతం - కోటి,
గానం : బాలు , చిత్ర,
పల్లవి:
జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నా బుగ్గ నీ వాయనం
జంటకే ఎదురేముందిలే
కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై
జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం
చరణం 1 :
ఓ మెరుపులా మెరిశావు
మిల మిల కిల కిల
నా నీల మేఘాలలో
ఆ ఉరుములా ఉరికావు
ఫెళ ఫెళ తళ తళ
ఆకాశ దేశాలలో
వాటేస్తే వరించు ఒళ్ళోనే భరించు
కాదంటే క్షమించు కౌగిల్లే బిగించు
ఈనాటి స్త్రీ కావ్యాలలో
వద్దంటే వలపే కదా...
జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం
చరణం 2 :
నా సరసకి వచ్చుంటే
సల సల విల విల
సాయింత్ర మయ్యిందిలే
నీ సొగసునే చూస్తుంటే
కలే ఇలై శకుంతలై
పండింది భావాలలో
లవ్ చేస్తే లభించు నాకోసం తపించు
నా పేరే జపించు నాతోనే సుఖించు
శ్రీవారి శృంగారాలలో
ఎన్నెల్లో ఎరుపాయేదా...
జం జుమ్మని నీ ముద్దు నా తాయిలం
ఘుమ్ ఘుమ్మని నీ బుగ్గ నా వాయనం
జంటకే ఎదురేముందిలే
కంటికే ఎదురే లేదులే
కవ్వింత రేగిందిలే రవ్వంత రాగమై
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి