RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, ఆగస్టు 2024, శనివారం

నన్ను దోచుకుందువటె | Nannu Dochukonduvate | Song Lyrics | Gulebakavali Katha (1962)

నన్ను దోచుకుందువటె



చిత్రం: గులేబకావళి కథ (1962)

సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


నన్ను దోచుకుందువటె 

వన్నెల దొరసాని

కన్నులలో దాచుకొందు నిన్నే 

నా సామి నిన్నే నా సామి


చరణం 1:


తరియింతును నీ చల్లని 

చరణమ్ముల నీడలోన

తరియింతును నీ చల్లని 

చరణమ్ముల నీడలోన

పూలదండవోలె 

కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె


ఎంతటి నెఱజాణవో 

నా అంతరంగమందు నీవు

ఎంతటి నెఱజాణవో 

నా అంతరంగమందు నీవు

కలకాలము వీడని 

సంకెలలు వేసినావు.. 

సంకెలలు వేసినావు 


నన్ను దోచుకుందువటె 

వన్నెల దొరసాని 

కన్నులలో దాచుకొందు 

నిన్నే నా సామి నిన్నే నా సామి 


చరణం 2:


నా మదియే మందిరమై 

నీవే ఒక దేవతవై

నా మదియే మందిరమై 

నీవే ఒక దేవతవై

వెలసినావు నాలో నే 

కలసిపోదు నీలో కలసిపోదు నీలో


ఏనాటిదో మనబంధం 

ఎరుగరాని అనుబంధం

ఏనాటిదో మనబంధం 

ఎరుగరాని అనుబంధం

ఎన్ని యుగాలైన ఇది 

ఇగిరిపోని గంధం

ఇగిరిపోని గంధం...


నన్ను దోచుకుందువటె 

వన్నెల దొరసాని 

కన్నులలో దాచుకొందు 

నిన్నే నా సామి నిన్నే నా సామి 


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు