RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, ఆగస్టు 2024, శనివారం

కలల అలలపై తేలెను | Kalala Alalapai Telenu | Song Lyrics | Gulebakavali Katha (1962)

కలల అలలపై తేలెను



చిత్రం: గులేబకావళి కథ (1962)

సంగీతం: జోసెఫ్-కృష్ణమూర్తి

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల, జానకి


పల్లవి:


కలల అలలపై తేలెను... 

మనసు మల్లెపూవై...

ఎగసి పోదునో చెలియా... 

నీవే ఇక నేనై...

కలల అలల పై..


చరణం 1:


జలకమాడు జవరాలిని.. 

చిలిపిగ చూసేవెందుకు

జలకమాడు జవరాలిని.. 

చిలిపిగ చూసేవెందుకు

తడిసి తడియని కొంగున... 

ఒడలు దాచుకున్నందుకు..

తడిసి తడియని కొంగున... 

ఒడలు దాచుకున్నందుకు..


చూపుతోనే హృదయ వీణ 

ఝుమ్మనిపించేవెందుకు

చూపుతోనే హృదయ వీణ 

ఝుమ్మనిపించేవెందుకు

విరిసీ విరియని పరువము... 

మరులు గొలుపుతున్నందుకు..

విరిసీ విరియని పరువము... 

మరులు గొలుపుతున్నందుకు..

కలల అలల పై..


చరణం 2:


సడి సవ్వడి వినిపించని 

నడి రాతిరి ఏమన్నది

సడి సవ్వడి వినిపించని 

నడి రాతిరి ఏమన్నది

జవరాలిని చెలికాణిని... 

జంట గూడి రమ్మన్నది

జవరాలిని చెలికాణిని... 

జంట గూడి రమ్మన్నది


విరజాజులు పరిమళించు 

విరుల పానుపేమన్నది

విరజాజులు పరిమళించు 

విరుల పానుపేమన్నది

అగుపించని ఆనందము... 

బిగికౌగిట కలదన్నది..

అగుపించని ఆనందము... 

బిగికౌగిట కలదన్నది..


కలల అలలపై తేలెను 

మనసు మల్లెపూవై...

ఎగసి పోదునో చెలియా... 

నీవే ఇక నేనై...

కలల అలల పై..


- పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు