RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, ఆగస్టు 2024, మంగళవారం

దేవుడెలా ఉంటాడని | Devudela vuntadani | Song Lyrics | Dora Babu (1974)

దేవుడెలా ఉంటాడని



చిత్రం :  దొరబాబు (1974)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి : 


దేవుడెలా ఉంటాడని.. 

ఎవరైన అడిగితే

మా అన్నలా ఉంటాడని 

అంటాను నేనూ


అనురాగమెలా ఉంటుందని.. 

ఎవరైనా అడిగితే

మా చెల్లిలా ఉంటుందని 

చెబుతాను నేనూ


చరణం 1 :


చెల్లెలున్న ఈ ఇల్లే 

సిరిమల్లె తోట

మా అమ్మలు చిరునవ్వే 

ముత్యాల మూట

చెల్లెలున్న ఈ ఇల్లే 

సిరిమల్లె తోట

మా అమ్మలు చిరునవ్వే 

ముత్యాల మూట


అన్నయ్య హృదయమే 

అందాల మేడ

చెల్లాయికి కలకాలం 

అది చల్లని నీడ

కన్నతల్లి తీపి కలల 

రూపాలం మనము

కన్నతల్లి తీపి కలల 

రూపాలం మనము

కోవెలలో వెలిగించిన 

దీపాలం మనము   

ఆ దేవుడెలా ఉంటాడని 

ఎవరైన అడిగితే

మా అన్నలా ఉంటాడని 

అంటాను నేనూ


చరణం 2 :


అల్లారు ముద్దుగా 

నను పెంచినావు

అమ్మనూ నాన్ననూ 

మరపించినావు


ఇల్లాలివై నీవు 

విలసిల్లవమ్మా

పిల్లాపాపలతోటి 

చల్లగా వుండవమ్మా


పుట్టినింట ఉన్నా.. 

మెట్టినింట ఉన్నా

పుట్టినింట ఉన్నా.. 

మెట్టినింట ఉన్నా

అన్నయ్య దీవనే...  

శ్రీరామరక్ష          


అనురాగమెలా ఉంటుందని 

ఎవరైనా అడిగితే

మా చెల్లిలా ఉంటుందని 

చెబుతాను నేనూ


ఆ దేవుడెలా ఉంటాడని 

ఎవరైన అడిగితే

మా అన్నలా ఉంటాడని 

అంటాను నేనూ


- పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు