RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, మార్చి 2024, సోమవారం

పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ | Poruginti Doragariki | Song Lyrics | Devadasu (1974)

పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ



చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి : 


పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ

ఇరుగింటి చినదానికి తగని మక్కువ

ఇద్దరికీ.. ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ? 


చరణం 1 :


ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు

ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది

ఈ మదికీ ఆ మదికీ అడ్డు గోడ లేదు

ఈ ఇంటికి ఆ ఇంటికి అడ్డుగోడ వుంది 


గోడ నడుమ ఒక మూయని తలుపు ఉందిలే ఆ..

తలుపు వెనుక రా రమ్మను పిలుపు ఉందిలే 


పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ

ఇరుగింటి చినదానికి తగని మక్కువ

ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ ?  



చరణం 2 :


చదవేస్తే ఉన్నమతి జారిందేమో?

మది నిండా వలపుంటే చదువు ఎందుకు

చదవేస్తే ఉన్నమతి జారిందేమో?

మది నిండా వలపుంటే చదువు ఎందుకు


దొరవేషం వేసినా దుడుకుతనం పోదా..  

ఏయ్

ఇంత ఎదిగినా నీలో పిరికితనం పోదా


పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ..

ఇరుగింటి చినదానికి తగని మక్కువ

ఇద్దరికీ ఇద్దరికీ కుదిరితే ఏమి తక్కువ


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు