మదనా సుందర నా దొరా
చిత్రం: గులేబకావళి కథ (1962)
సంగీతం: జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
మదనా సుందర నా దొరా...
ఓ మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర..
ఓ మదనా సుందర నాదొరా...
చిన్న దానను నేను వన్నెకాడవు నీవు
చిన్న దానను నేను వన్నెకాడవు నీవు
నాకూ నీకూ జోడు ….
నాకూ నీకూ జోడు రాకా చంద్రుల తోడు...
మదనా సుందర నాదొరా...
చరణం 1:
మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెల పైన...
మిసిమి వెన్నెలలోన... పసిడి తిన్నెల పైన
రసకేళి తేలి … రసకేళి తేలి...
పరవశామౌద మీవేళ
మదనా సుందర నా దొరా
చరణం 2 :
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి...
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
వుడికించ కింకా ….. వుడికించ కింక
చూడొకమారు నా వంక
మదనా సుందర నా దొరా...
చరణం 3 :
మరులు సైపగ లేను.. విరహామోపగ లేను....
మరులు సైపగ లేను.. విరహామోపగ లేను
మగరాయడా రా రా ……
మగరాయడా రా రా బిగి కౌగిలీ తేర...
మదనా సుందర నా దొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర....
ఓ మదన సుందర నా దొరా...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి