RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, మార్చి 2024, మంగళవారం

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా | Telugu veera levara | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా



చిత్రం :  అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపథ్య గానం : ఘంటసాల,  రామకృష్ణ


పల్లవి :


ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...

తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. 

దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా

దేశమాత స్వేఛ్ఛ కోరి 

తిరుగుబాటు చేయరా..


తెలుగు వీర లేవరా 

దీక్ష బూని సాగరా

దేశమాత స్వేఛ్ఛ కోరి 

తిరుగుబాటు చేయరా

ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....



చరణం 1 :


దారుణమారణకాండకు 

తల్లడిల్లవద్దురా... ఆ ఆ ఆ ....

నీతిలేని శాసనాలు 

నేటినుండి రద్దురా.. ఆ ఆ ఆ .....

దారుణమారణకాండకు 

తల్లడిల్లవద్దురా

నీతిలేని శాసనాలు 

నేటినుండి రద్దురా


నిదురవద్దు..బెదరవద్దు

నిదురవద్దు..బెదరవద్దు

నింగి నీకు హద్దురా.. 

నింగి నీకు హద్దురా

ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ..... 


చరణం 2 : 


ఓ ఓ ఓ ఓ ఓ...

ఎవడువాడు?..ఎచటివాడు?

ఎవడు వాడు? ఎచటి వాడు?

ఇటువచ్చిన తెల్లవాడు


కండబలం కొండ ఫలం

కబళించే దుండగీడు.. 

కబళించే దుండగీడు

మానధనం.. ప్రాణధనం

దోచుకొనే దొంగవాడు.. 

దొచుకొనే దొంగ వాడు

ఎవడు వాడు ఎచటి వాడు 

ఇటు వచ్చిన తెల్లవాడు

తగినశాస్తి చేయరా...

తగిన శాస్తి చేయరా ...

తరిమి తరిమి కొట్టరా.... 

తరిమి తరిమి కొట్టరా..


తెలుగు వీర లేవరా! 

దీక్ష బూని సాగరా!

దేశమాత స్వేఛ్ఛ కోరి 

తిరుగుబాటు చేయరా!

ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ..... 


చరణం 3 :


ఈ దేశం... ఈ రాజ్యం...

ఈ దేశం ఈ రాజ్యం .. 

నాదే అని చాటించి.. 

నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలు గొట్టి...

శృంఖలాలు పగులగొట్టి..

శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుపెట్టి...

తుది సమరం మొదలుపెట్టి.. 

తుది సమరం మొదలుపెట్టి..


సింహాలై గర్జించాలీ... 

సింహాలై గర్జించాలీ

సంహారం సాగించాలీ... 

సంహారం సాగించాలీ


వందేమాతరం... వందేమాతరం..

వందేమాతరం... వందేమాతరం..


చరణం 4 :

ఓ ఓ ఓ ఓ ఓ...

స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య భానుడా

అల్లూరి సీతారామరాజా.. 

అల్లూరి సీతారామరాజా

స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య భానుడా

అల్లూరి సీతారామరాజా.. 

అల్లూరి సీతారామరాజా


అందుకో మా పూజ లందుకో.. రాజా..

అందుకో మా పూజ లందుకో.. రాజా..

అల్లూరిసీతారామరాజా.. ఆ...

అల్లూరిసీతారామరాజా..


ఓ ఓ ఓ ఓ ఓ...

తెల్లవాడి గుండెల్లో 

నిదురించిన వాడా

మా  నిదురించిన పౌరుషాగ్ని 

రగిలించినవాడా

తెల్లవాడి గుండెల్లో 

నిదురించిన వాడా

మా  నిదురించిన పౌరుషాగ్ని 

రగిలించినవాడా


త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం

త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం

నిశ్చయముగ నిర్భయముగ.. 

నీ వెంటనే నడుస్తాం...

నిశ్చయముగ నిర్భయముగ.. 

నీ వెంటనే నడుస్తాం...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు