RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, మార్చి 2024, ఆదివారం

ఈ కోవెల నీకై వెలిసింది | Ee Kovela neekai Velisindi | Song Lyrics | Andaman Ammayi (1979)

ఈ కోవెల నీకై వెలిసింది



చిత్రం :  అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల, బాలు,


పల్లవి :


ఈ కోవెల నీకై వెలిసింది.. 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా దేవి తరలి రా.. 

నా దేవి తరలిరా

ఈ కోవెల నీకై వెలిసింది.. 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా స్వామీ తరలి రా.. 

నా స్వామి తరలిరా 

 

చరణం 1 :


 దేవత గుడిలో లేకున్నా 

దీపం పెడుతూ ఉన్నాను

దేవత గుడిలో లేకున్నా 

దీపం పెడుతూ ఉన్నాను

తిరునాళ్ళేపుడో రాక తప్పదని 

తేరును సిద్ధం చేసాను

 

దేవుడు వస్తాడని రోజూ 

పూవులు ఏరి తెస్తున్నాను

దేవుడు వస్తాడని రోజూ 

పూవులు ఏరి తెస్తున్నాను

రేపటి కోసం చీకటి మూసిన 

తూరుపులాగా ఉన్నాను

తూరుపులాగా ఉన్నాను

 


ఈ కోవెల నీకై వెలిసింది..

ఈ వాకిలి నీకై తెరిచింది

రా దేవి తరలి రా..

నా దేవి తరలిరా


చరణం 2 :


 నీరు వచ్చే ఏరు వచ్చే..

ఏరు దాటే ఓడ వచ్చే

నీరు వచ్చే ఏరు వచ్చే..

ఏరు దాటే ఓడ వచ్చే

ఓడ నడిపే తోడు దొరికే 

ఒడ్డు చేరే రోజు వచ్చే

 

ఓడ చేరే రేవు వచ్చే 

నీడ చూపే దేవుడొచ్చే

ఓడ చేరే రేవు వచ్చే 

నీడ చూపే దేవుడొచ్చే

రేవులోకి చేరేలోగా 

దేవుడేదో అడ్డువేసే

ఆ..దేవుడేదో అడ్డువేసే


ఈ కోవెల నీకై వెలిసింది.. 

ఈ వాకిలి నీకై తెరిచింది

రా దేవి తరలిరా.. 

నా స్వామీ తరలిరా

రా దేవి తరలిరా.. 

నా స్వామీ తరలిరా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు