RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, మార్చి 2024, గురువారం

ఒక వనిత నవ ముదిత సుమ లలిత | Oka Vanitha Nava Mudita | Song Lyrics | Intlo Ramayya Veedhilo Krishnayya (1982)

ఒక వనిత నవ ముదిత సుమ లలిత



చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)

సంగీతం: జె.వి. రాఘవులు

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు


పల్లవి:


హాఁ..ఆ..ఓ.. అజంతా వెలవెలబోదా... 

ఎల్లోరా తల్లడిల్లదా

కాశ్మీరం కలవర పడదా... 

తాజ్మహల్ తడబడి పోదా

ఆ..ఆ..ఆ.. హాయ్ హాయ్.. ఆ..ఆ..ఆ..

ఒక వనిత... నవ ముదిత... 

సుమ లలిత... రస భరిత

ఒక వనిత... నవ ముదిత... 

సుమ లలిత... రస భరిత

అలిగితే ఏమవుతుంది... 

అందం నాగు పామౌతుంది

గోరింకా... హహహ... ఓ గోరింకా... హేయ్...

గోరింకా... హా... ఓ గోరింకా... హా..హా..హా..హా..


చరణం 1:


ఆ... కొసవేళ్ళ సవరణ నోచుకున్నా... 

కురులదేమి భాగ్యమో

ఆ... అడుగుల నునుపు ముద్దాడుకున్నా... 

గడపదెంత సౌభాగ్యమో... ఆ..ఆ..

అది కంటి మెరుపో... ఆ బ్రహ్మ గెలుపో

అది కంటి మెరుపో... ఆ బ్రహ్మ గెలుపో

కాకా... కాకా... కాకా...

లల్లలా... లల్లలా... లల్లలా... లర లా...


అలిగితే ఏమౌతుంది 

ఉదయమే నడిజామౌతుంది

గోరింకా... ఓ గోరింకా... హోయ్... ఊఁహహ...

గోరింకా... హా... ఓ గోరింకా... హా..హా..హా..హా..


చరణం 2:


ఆ... అలివేణి మోమును చూసిన... 

అద్దానిదెంతటి పుణ్యమో

ఆ... చెలి నుదుటను ముద్దుగ దిద్దిన.. 

తిలకానిదెంతటి లావణ్యమో...ఆ...ఆ...

ఆ రంభ రూపం... అపరంజి శిల్పం...హ హ

ఆ రంభ రూపం... అపరంజి శిల్పం...హ హ

ఆ చంద్ర వదన... ఆ కుందరదన... 

ఆ కమల నయన... ఆ కాంతి సదన

నవ్వితే ఏమౌతుంది... 

నవ్వే నవ్వుకు నవ్వౌతుంది


గోరింకా... హే గోరింకా...హ..హ..హ..

గోరింకా...

హా చాలింకా...హ..హ..హ..


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు