వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
చిత్రం : రామయ్య తండ్రి (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
పెద్దలంత పిల్లలుగా మారే రోజు
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు
దీపావళి రోజు... దీపావళి రోజు...
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
ఇది వెన్నెల రోజు
పున్నమి రోజు ఇది వెన్నెల రోజు
చరణం 1 :
చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే
దీపావాళి రోజు... దీపావళి రోజు
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
చరణం 2 :
జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చి పెడుతుందని
నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చి పెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు
దీపావళి రోజు... దీపావళి రోజు...
దీపావళి రోజు... దీపావళి రోజు...
పాటల ధనుస్సు
అమావాస్యనాడు వచ్చే వెన్నెలరోజు ... ఆహా మల్లెమాల ఎంత బాగారాశారు!!? దీపావళి నాటి బాణాసంచాని జీవితానికి అన్వయిస్తూ అర్థవంతంగా రాసినచక్కని పాట ..
రిప్లయితొలగించండి