RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఏనాడు అనుకోనిదీ | Yenadu Anukonidi | Song Lyrics | Doralu Dongalu (1976)

ఏనాడు అనుకోనిదీ



చిత్రం :  దొరలు దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 1 :


వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు

పెదవుల కందించనా.. పరవశ మొ౦దించనా


అందం విరిసిన ఆమని వేళా

విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా

వేడుక.. వాడుక.. కాకుండనా...


ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 2 :


కౌగిట అదిమి...  హృదయం చిదిమి

మధువులు కురిపించనా.. 

మదనుని మురిపించనా   


అందని స్వర్గం ముందు నిలిచితే

ఎందుకు పోమ్మ౦దునా.. 

ఇది వేళ కాదందునా

తీరిక.. కోరిక.. లేదందునా



ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు