RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

నూటికో కోటికో ఒక్కరు | Nootiko kotiko okkaru | Song Lyrics | Viswaroopam (1981)

నూటికో కోటికో ఒక్కరు


చిత్రం :  విశ్వరూపం (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి నారాయణరావు 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు

నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు

అది మీరే మీరే మాస్టారు... 

మా దేవుడు మీరే మాస్టారు

అది మీరే మీరే మాస్టారు... 

మా దేవుడు మీరే మాస్టారు

నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు 


చరణం 1 :


దారే దొరకని చీకటిలో 

తానే వెలుగై నడిచాడు...

జాతే నా వెలుగన్నాడు 

జాతిపిత మన జాతిపిత...

దిక్కులు తెలియని సమయంలో...

తానే దిక్కుగ నిలిచాడు 

శాంతిని నేతగ నిలిపాడు...

శాంతిదూత మన శాంతిదూత...


ఆ జాతిపిత బాపూజీ 

మీలో వెలిశాడు....

ఆ శాంతి దూత నెహ్రూజీ 

మీలో కలిశాడు....

ఎందరో ఇంకెందరో 

మీలో ఉన్నారు....

మా దేముడు మీరే మాస్టారు.... 

మా దేముడు మీరే మాస్టారు


నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు


చరణం 2 :


జరిగే జీవిత సమరంలో 

జారే నైతిక విలువల్లో

నీతిని నేతగా నిలపాలి 

నవయువత.. యువనేత..

చుక్కలు మాడే గుండె.. 

నిప్పులు వెలగని గుడిసెల్లో

ఆశను జ్యోతిగా నిలపాలి 

నవయువత.. యువనేత..


ఈ యువత తాత గాంధీజీ 

మీలో మిగిలారు

మీ నవతకు నేతాజీ 

మీలో రగిలారు

అందరూ ఆ అందరూ 

మీలో ఉన్నారు

దేశానికి మీరే సారధులు... 

దేశానికి మీరే సారధులు


నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు

నూటికో కోటికో ఒక్కరు... 

ఎప్పుడో ఎక్కడో పుడతారు

అది మీరే మీరే మాస్టారు... 

మా దేవుడు మీరే మాస్టారు

అది మీరే మీరే మాస్టారు... 

మా దేవుడు మీరే మాస్టారు


పాటల ధనుస్సు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు