RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇది తొలి పాట ఒక చెలి పాట | Idi Toli pata oka cheli pata | Song Lyrics | Kanyakumari (1977)

ఓహో చెలీ ఓ ఓ నా చెలీ



చిత్రం : కన్య కుమారి (1977) 

సంగీతం : బాలు 

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు 


పల్లవి: 


ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ

ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


చరణం 1: 


ఎదుట నీవు.. ఎదలో నీవు.. 

ఎదిగి ఒదిగి నాతో ఉంటే 

మాటలన్ని పాటలై మధువులొలుకు 

మమతే పాట 

నీలి నీలి నీ కన్నులలో.. 

నీడలైన నా కవితలలో 

నీ చల్లని చరణాలే నిలుపుకున్న 

వలపీ పాట 

పరిమళించు ఆ బంధాలే పరవశించి.. 

పాడనా.. పాడనా..పాడనా 



ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ 

ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


చరణం 2: 


చీకటిలో వాకిట నిలిచి... 

దోసిట సిరిమల్లెలు కొలిచి 


నిదుర కాచి నీకై వేచి... 

నిలువెల్లా కవితలు చేసి 


కదలి కదలి నీవొస్తుంటే...  

కడలి పొంగులనిపిస్తుంటే 


వెన్నెలనై.. నీలో అలనై.. 

నీ వెల్లువకే వేణువునై


పొరలిపొంగు నీ అందాలే 

పరవశించి పాడనా.. ఆహాహా 

పొరలిపొంగు నీ అందాలే 

పరవశించి పాడనా... 

పాడనా... పాడనా 




ఓహో చెలీ.. ఓ.. నా చెలీ 


ఇది తొలి పాట... ఒక చెలి పాట 


వినిపించనా ఈ పూట... ఆ పాట


ఇది తొలి పాట... ఆ...

ఇది తొలి పాట... ఉమ్మ్.. 

ఇది చెలి పాటా...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు