RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, సెప్టెంబర్ 2022, బుధవారం

నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు | Nakante Chinnodu | Song Lyrics | Koduku Kodalu (1972)

నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు



చిత్రం : కొడుకు కోడలు (1972)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల 



పల్లవి :


నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు

నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు


అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు

నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు


నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు

నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు


అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు

నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు


నాకంటే చిన్నోడు... నాతమ్ముడూన్నాడు

అన్నాడు ఒక పిల్లగాడు



చరణం 1 :



పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు..ఓయ్

పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు

కల్లబొల్లి మాటలతో... కళ్ళలోకి పాకాడు


పిల్లిలా వచ్చాడు... ప్రేమలో పడ్డాడు

కల్లబొల్లి మాటలతో... కళ్ళలోకి పాకాడు


దమ్ములేని సోగ్గాడు... తమ్ముడిపై నెట్టాడు

దమ్ములేని సోగ్గాడు... తమ్ముడిపై నెట్టాడు

ఆ తమ్ముడే నచ్చాడంటే... ఈ అన్న ఏమౌతాడు




నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు

అన్నాడు ఒక పిల్లగాడు




చరణం 2 :



తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి

అన్నేమో చేతగాని వెంగళాయి

తమ్ముడేమో కొరకరాని గడుగ్గాయి

అన్నేమో చేతగాని వెంగళాయి


తెలివుంది అన్నకూ... 

కండబలముంది తమ్ముడికీ...

ఈ రెండు కావాలీ... హా

ఈ రెండు కావాలి...  దోర దోర అమ్మాయికి



నాకంటే చిన్నోడు... నాతమ్ముడున్నాడు

అన్నాడు ఒక పిల్లగాడు



చరణం 3 :



గువ్వలాగున్నానా... కోతిననుకొన్నానా

పడుచుపిల్ల ఎదటున్న... 

చలికి వణుకుతున్నానా... హాయ్

గువ్వలాగున్నానా... కోతినను కొన్నానా


పడుచుపిల్ల ఎదటున్న... చలికి వణుకుతున్నానా

ఒంటరిగా వచ్చానూ... జంటనెదురు చూస్తున్నాను

ఒంటరిగా వచ్చానూ... జంటనెదురు చూస్తున్నాను

పసలేమి లేని వాడవనీ..మ్మ్ ..ఆశవదులు కొన్నాను 



నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు

నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు

అన్నాడు ఒక పిల్లగాడు... అల్లరల్లరీ బుల్లోడు

నిలదీసి అడిగితే... నీళ్ళునములుతున్నాడు


నాకంటే చిన్నోడు... నా తమ్ముడున్నాడు

అన్నాడు ఒక పిల్లగాడు


హేయ్... పిల్లగాడు..

హేయ్ హేయ్ పిల్లగాడు

హేయ్ హేయ్ పిల్లగాడు.

హేయ్ హేయ్ పిల్లగాడు

హేయ్ హేయ్ పిల్లగాడు..


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు