యవ్వనమంతా నవ్వుల సంతా
చిత్రం : వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
యవ్వనమంతా నవ్వుల సంతా
చరణం 1 :
నీలగిరి కొండల్లో నెమలిగా పుట్టాలి
నీలగగనాలలో ఉరుమునై రావాలి
చంద్రగిరి కోనల్లో వెన్నెలై రావాలి...
జాబిల్లి మంచుల్లో జాజినై నవ్వాలి
హా.. ఆ నవ్వు నా కంటికే దివ్వెగా నువ్వుగా నవ్వగా
యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
చరణం 2 :
నీ భావశిఖరంలో భాషనై పొంగాలి
నీ రాగ హృదయంలో కవితనై కదలాలి
ఆ.. లలలలా.. లలలలా...
ఆ కవిత నా బ్రతుకై అలరారు వేళల్లో
ఆరారు ఋతువుల్లో కోయిలలు పాడాలి
హా.. ఆ కోయిలే కోరికై గుండెలో పాడగా..
పండగా
యవ్వనమంతా నవ్వుల సంతా
నవ్విన జంటే నందనమంటా
నీ కన్నే వెన్నెలై... నా చూపే చుక్కలై
ఈ రేయి అందాలు ఆరెయ్యమన్నాది..
సాగే సంసారం
లలలలలాల.. లలలలలా..
లలలాలాలలలాలాల
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి