RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, ఆగస్టు 2022, సోమవారం

ఓ చెలి చలి చలి | O Cheli Chali Chali | Song Lyrics | Simhabaludu (1978)

ఓ చెలి చలి చలి



చిత్రం :  సింహబలుడు (1978)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


ఆ... అహా.. అహహ.. హా

ఆ... అహా.. అహహ.. హా

ఆహహా..ఉమ్మ్.ఉమ్మ్..ఉ... 


ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..

ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..


నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...

నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...


నడి రేయిలో ఎదో ఎదో తొలి హాయి రేగెలే..

ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే.. 


అందమైన ఆ చలి .. కోరే కౌగిలి..

అందమైన ఆ చలి .. కోరే కౌగిలి..

ఆపలేని  నా చలి.. తీర్చవే చెలి..

ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే.. 



చరణం 1 :


నేనే గువ్వనై.. నా నువ్వే గూడువై.. హా..

నేనే గువ్వనై.. నా నువ్వే గూడువై..

తోడుగా.. నీడగా.. ఈడుగా... జోడుగా.. 

నువ్వుంటే చాలులే..


గుడిలో గంటగా.. నా ఒడిలో జంటగా..

గుడిలో గంటగా.. నా ఒడిలో జంటగా..

నీవు నా ప్రాణమై.. నేను నీదాననై.. 

మనముంటే చాలులే 



ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..

నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...

నడి రేయిలో ఎదో.. ఎదో తొలి హాయి రేగెలే..

ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..   



చరణం 2 :



నవ్వే కన్నుల.. నా నువ్వే వెన్నెల..

నవ్వే కన్నుల.. నా నువ్వే వెన్నెల..

నింగినై పొంగనా.. తారనై చేరనా... 

ఇక నీలో నీవుగా...


ఎదలో కోరికా.. నా ఎదుటే తీరగా..

ఎదలో కోరికా.. నా ఎదుటే తీరగా..

అందమే పండగా.. బంధమై ఉండనా... 

ఇక నేనే నీవుగా..



ఓ చెలి చలి చలి.. ఇదేమి మంటలే.. హహా...

నా ప్రియా చలి గిలి మన ప్రేమ మంటలే...

నడి రేయిలో ఎదో ఎదో తొలి హాయి రేగెలే..

ఓ చెలి చలి చలి.. ఇదేమి మంటలే..

లలలలలలల.. లలలలలలలా..


పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు