RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, ఆగస్టు 2022, ఆదివారం

రాసలీలవేళ రాయబారమేల | Rasaleela vela | Song Lyrics | Aditya 369 (1991)

రాసలీలవేళ రాయబారమేల



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి   



పల్లవి :


రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

రాసలీలవేళ రాయబారమేలా  



చరణం 1 :


కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా

తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల

మోజులన్నీ పాడగా జాజిపూల జావళి

కందెనేమో కౌగిట అందమైన జాబిలి


తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము

మేని వీణలోన..... పలికే సోయగాల రాగము

నిదురరాని కుదురులేని

ఎదలలోని సొదలుమాని 

రాసలీలవేళ రాయబారమేల


చరణం 2 : 


మాయజేసి దాయకు.. సోయగాల మల్లెలు

మోయలేని తీయని హాయి...పూల జల్లులు

చేరదీసి పెంచకు భారమైన యవ్వనం

దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం

చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా

చూపు ముళ్ళు ఓపలేను

కలల తలుపు తీయనా

చెలువ సోకు కలువ రేకు

చలువ సోకి నిలువ నీదు 


రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

రాసలీలవేళ రాయబారమేలా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు