RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, ఆగస్టు 2022, సోమవారం

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా | Krishna Sastri Kavithala | Song Lyrics | Bhagyalakshmi (1983)

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా



చిత్రం : భాగ్యలక్ష్మి (1983)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగూ... ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా

చరణం 1:

కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ...
తెలుగూ....... ఆ ఆ ఆ....
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కూచిపూడి నర్తన... త్యాగరాజ కీర్తనా
కూచిపూడి నర్తన... త్యాగరాజ కీర్తనా
అడుగడుగు అణువణువూ అచ్చ తెలుగు...
జిలుగు తెలుగు... సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు... ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా... కృష్ణవేణి పొంగులా

చరణం 2:
పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ..
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ
కందుకూరి సంస్కారం... చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం... చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా....
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా

పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు