బంగినపల్లి మామిడి పండు
చిత్రం: కొండవీటి సింహం (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది..
ఊహూహ్
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది..
ఊహూహ్
అది ఏ తొటదో ఈ పేటదో ..
అది ఏ తొటదో ఈ పేటదో
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది..
ఊహూహ్
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది..
ఊహూహ్
ఇది నీ కొసమే పండింది లే ..
ఇది నీ కొసమే పండింది లే
చరణం 1:
పెదవులా రెండు దొండపళ్ళూ
చెక్కిళ్ళా చక్కెరకేళి అరటి పళ్ళు
నీలికన్ను నేరేడు పండు ..
నీలికన్ను నేరేడు పండు ..
నిన్ను చూసి నా ఈడు పండు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు ..
వలపుల్ల వడ్లమూడి నారింజలు
పాలకొల్లు తొటలోన బత్తాయిలు ..
వలపుల్ల వడ్లమూడి నారింజలు
కొత్తపల్లి కొబ్బరంటి చలికోర్కెలు ..
తొలికాపుకొచ్చాయి నీ చూపులు ..
ఈ మునిమాపులు..
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది...
ఊహూహ్
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది
ఇది నీ కొసమే పండింది లే ..
ఇది నీ కొసమే పండింది లే
చరణం 2:
పలుకులా తేనె పనసపళ్ళు
తళుకులా పచ్చ దబ్బపళ్ళు
నీకు నేను దానిమ్మపండు ..
నీకు నేను దానిమ్మపండు ..
నిన్ను జేరే నా నోము పండు
అరె నూజువీడు సరసాల సందిళ్ళల్లో ..
సరదా సపోటాల సయ్యాటాలో
నూజువీడు సరసాల సందిళ్ళల్లో ..
సరదా సపోటాల సయ్యాటాలో
చిత్తూరు మామిళ్ళ చిరువిందులే ..
అందించుకోవాలి అర ముద్దులు ..
మన సరిహద్దులో..
బంగినపల్లి మామిడి పండు కోత కొచ్చింది..
ఊహూహ్
చిలకే నువ్వని జాంపండు చేతికొచ్చింది..
ఊహూహ్
ఇది నీ కొసమే పండింది లే ..
ఇది నీ కొసమే పండింది లే
బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది..
ఊహూహ్
చిలకే ముట్టని జాంపండు సిగ్గు పడుతుంది..
ఊహూహ్
అది ఏ తొటదో ఈ పేటదో ..
అది ఏ తొటదో ఈ పేటదో
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి