RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, ఆగస్టు 2022, మంగళవారం

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ | Centureelu kotte | Song Lyrics | Aditya 369 (1991)

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి   



పల్లవి :


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ 



చరణం 1 :


మేఘమాలనంటుకున్న యాంటినాలతో

మెరుపుతీగ మీటి చూడు తందనాలతో

సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో

వలపు వేణువూది చూడు వందనాలతో

చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ 

ఈడుజోడు తుఫానులో

కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న కుర్రవాళ్ళ 

ఈలపాట హుషారులో

లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు

ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు

వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ



సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ 



చరణం 2 : 


వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో రెచ్చి 

రాసుకున్నపాటకెన్ని పంక్తులో

విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో 

కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో

ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు 

హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో

కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు 

కమ్ముకున్న కౌగిలింత కధక్కులో

నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా

గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా

పాటలన్ని పూవులైన తోటలాంటి 

లేత యవ్వనాన


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు