చాలదా ఈ చోటు
చిత్రం : నేనంటే నేనే (1968)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
ఎందులోనూ లేని సుఖం... పొందులోనే ఉంది నిజం
ఈ పొందులోనే ఉంది నిజం
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం 1 :
కనులూ కనులూ కలుపుటకు...
మనసులోనిది తెలుపుటకు
వలపుల ఊయలూగుటకు...
కలల కడలిలో తేలుటకు
అందరాని స్వర్గమేదో ఇందులోనే అందుటకు...
ఇందులోనే అందుటకు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం 2 :
వానకు తడిసిన మేనిలో.. ఓ.. ఓ...
వెచ్చని కోరికలూరగా... ఆ ఆ..
ఎన్నడు తీరని ఆశలూ అన్నీ నేడే తీరగా
ఎన్నడు తీరని ఆశలూ అన్నీ నేడే తీరగా
కానరాని అందమంతా కనులముందే నిలువగా...
కనులముందే నిలువగా
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు... రాదులే ఏ లోటు
చరణం 3 :
చెక్కిలి చెక్కిలి చేరగా... ఆ.. ఆ.. ఆ
ఏవో గుసగుసలాడగా.. ఆ.. ఆ..
ఉరుముల మెరుపుల జోరులో హృదయాలొకటై సోలగా
మనకు తెలియని మైకం లోనా మనము ఒకటై పోవగా...
మనము ఒకటై పోవగా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి