RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, ఆగస్టు 2022, శుక్రవారం

ఓ చిన్నదాన నన్ను విడిచి పొతావంటే | O chinnadana | Song Lyrics | Nenante Nene (1968)

ఓ చిన్నదాన నన్ను విడిచి పొతావంటే



చిత్రం:  నేనంటే నేనే (1968)

సంగీతం:  కోదండపాణి

గీతరచయిత:  కొసరాజు

నేపధ్య గానం:  బాలు


పల్లవి:


    ఓ చిన్నదానా

    ఓ చిన్నదాన నన్ను విడిచి పొతావంటే

    పక్కనున్న వాడి మీద నీకు దయరాదంటే

    ఒక్కసారి ఇటు చూడు.. పిల్లా

    మనసువిప్పి మట్లాడు.. బుల్లి

    ఒక్కసారి ఇటు చూడు

    మనసు విప్పి మత్లాడు

    నిజం చెప్పవలనంటే

    నీకు.. నాకు.. సరిజోడు

    గుంతలకడి గుంతలకడి గుమ్మా

    హ.. గుంతలకడి గుంతలకడి గుమ్మా

    గుంతలకడి గుంతలకడి గుమ్మా


చరణం 1:


    నే చూడని జాణ లేదు భూలోకంలో

    పిల్లా... నను మెచ్చని రాణి లేదు పై లోకంలో

    హేహే ..హేహే ..ఓహో..ఓహో..

    నే చూడని జాణ లేదు భూలోకంలో

    పిల్లా... నను మెచ్చని రాణి లేదు పై లోకంలో


    కంటికి నచ్చావే చెంతకు వచ్చానే

    కంటికి నచ్చావే చెంతకు వచ్చానే

    నిలవకుండ పరుగుతీస్తే నీవే చింతపడతావే


    గుంతలకడి గుమ్మా గుంతలకడి గుమ్మా

    గుంతలకడి గుమ్మా గుంతలకడి గుమ్మా

    గుంతలకడి గుమ్మా గుంతలకడి గుమ్మా


చరణం 2:


    బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే

    చేయి పట్టి ఆడినప్పుడు బిగువు చేయకే

    బెదిరి బెదిరి లేడిలాగ గంతులేయకే

    చేయి పట్టి ఆడినప్పుడు బిగువు చేయకే


    రంగు చీరలిస్తానే.. హేహే ...హేహే..

    రంగుచీరలిస్తానే రవ్వల కమ్మలిస్తానే

    దాగుడుమూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్లా


    గుంతలకిడి గుమ్మా గుంతలకిడి గుమ్మా

    గుంతలకడి గుమ్మా గుంతలకడి గుమ్మా

    గుంతలకడి గుమ్మా గుంతలకడి గుమ్మా


చరణం 3:


    నీ నడుముపట్టి హంసలాగ నాట్యం చేస్తా

    నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా

    ఓహో ..ఓహో.. హహ..ఆహ..

    నీ నడుముపట్టి హంసలాగ నాట్యం చేస్తా

    నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా


    కారులోన ఎక్కిస్తా.. పోయ్.. పోయ్

    జోరుజోరుగా నడిపేస్తా...

    కారులోన ఎక్కిస్తా.. జోరుజోరుగా నడిపేస్తా

    చెంప చెంప రాసుకుంటు జల్సాగ గడిపేస్తా

    పిప్పిరి పీప్పి...పిపిపి... పిప్పిరి పీప్పి..పిపిపి..


    ఓ చిన్నదాన...

    ఓ చిన్నదాన... నన్ను విడిచి పొతావంటే

    పక్కనున్నవాడి మీద నీకు దయరాదంటే

    ఒక్కసారి ఇటు చూడు.. మనసువిప్పి మాట్లాడు

    నిజం చెప్పవలనంటే నీకు.. నాకు.. సరిజోడు


    గుంతలకిడి గుంతలకిడి గుమ్మా

    గుంతలకిడి గుంతలకిడి గుమ్మా

    గుంతలకిడి గుంతలకిడి గుమ్మా


పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు