నీ మనసులోకి రావాలి కాపురానికి
చిత్రం : జగత్ జెంత్రీలు (1971)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : విజయరత్నం
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నీ.. మనసులోకి రావాలి కాపురానికి...
నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి
నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి
నా... మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికి
చరణం 1 :
అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేశాడు.. అహా..
అబ్బబ్బో అయ్యయ్యో మెల్లగ దోచాడు.. హాయ్ హాయ్
అమ్మమ్మో అయ్యయ్యో అల్లరి చేశాడు..
అబ్బబ్బో అయ్యయ్యో మెల్లగ దోచాడు..
ఏమేమో చేశాడమ్మా... ఓ.. ఓ.. ఓ..
నే మైమరచిపోయానమ్మో...
చేసింది ఏముంది.. చేసేది రేపుంది...
చేసింది ఏముంది.. చేసేది రేపుంది...
ఉలికి ఉలికి పడబోకు ఉన్నదంత ముందుంది
ఎంతెంతో ఉందమ్మో.. ఇంకెంతో ఉందమ్మో
నా... మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికి
నీ విషయమంత తెలియాలి ఇవ్వడానికి
చరణం 2 :
అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసింది... ఊహూ..
అబ్బబ్బ ఒళ్ళంత అల్లుకుపోయింది...
అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసింది...
అబ్బబ్బ ఒళ్ళంత అల్లుకుపోయింది...
ఎన్నెన్నో చేసిందమ్మా... ఓహో..హో..
వారేవా మొనగాడా... తగ్గాలి నీ జోరు
వారేవా మొనగాడా... తగ్గాలి నీ జోరు
జగత్ జంత్రి నీవైతే.. జగత్ జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే జగమంతా మనదేలే...
జగమంతా మనదేలే.. ఈ యుగమంతా మనదేలే
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి