RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, మే 2022, ఆదివారం

తింటే గారెలే తినాలి | Thinte Garele Thinali | Song Lyrics | Kanna Koduku ((1973)

తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి



చిత్రం :  కన్నకొడుకు (1973)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి : 


తింటే గారెలే తినాలి.. 

వింటే భారతం వినాలి

ఉంటే నీ జంటగా ఉండాలి

సై యంటే... స్వర్గాలే దిగి రావాలి

తింటే గారెలే తినాలి... 

వింటే భారతం వినాలి





చరణం 1 :


మొలక మబ్బులు ముసిరితే... ఓహో

చిలిపి గాలులు విసిరెతే... ఓహో

మొలక మబ్బులు ముసిరితే... 

చిలిపి గాలులు విసిరెతే

పచ్చపచ్చని పచ్చిక బయలే 

పానుపుగా అమరితే.. 

అమరితే.. అమరితే

వీడని కౌగిట వేడి వేడిగా... 

చూడని రుచులే చూడాలి


తింటే గారెలే తినాలి... 

వింటే భారతం వినాలి

ఉంటే నీ జంటగా ఉండాలి

సై యంటే... స్వర్గాలే దిగి రావాలి




చరణం 2 :



వీడని కౌగిట వేడి వేడిగా... 

చూడని రుచులే చూడాలి .

నీ నల్లని నీ కురులను నే దువ్వీ... 

ఈ సిరిమల్లెలు నీ జడలో నే తురిమీ

పట్టుచీరే కట్టించి... పైట నేనే సవరించి... 

సవరించి... సవరించి

నిగనిగలాడే నీ సొగసంతా... 

నే నొక్కడినే చూడాలి . .    

     

తింటే గారెలే తినాలి...  

వింటే భారతం వినాలి

ఉంటే నీ జంటగా ఉండాలి...

సై యంటే... స్వర్గాలే దిగి రావాలి 


చరణం 3 :



తీయగా నువు కవ్విస్తే.. ఓహో

తీగలా నను పెనవేస్తే..  ఓహో

తీయగా నువు కవ్విస్తే.. 

తీగలా నను పెన వేస్తే

పూలతోట పులకరించీ -  

ఈల పాటలు పాడితే... 

పాడితే.. పాడితే

పొంగే అంచుల పల్లకిపైన 

నింగి అంచులను దాటాలి.. 


తింటే గారెలే తినాలి..  

వింటే భారతం వినాలి

ఉంటే నీ జంటగా ఉండాలి...  

సై యంటే...  స్వర్గాలే దిగిరావాలి


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు