చిరునవ్వుల తొలకరిలో
చిత్రం: చాణక్య-చంద్రగుప్త (1977)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
హ..హ..హ..హ..హ
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల  చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల  చినుకులలో
పలికెనులే.. హృదయాలే..
పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల  చినుకులలో
చరణం 1: 
వసంతాలు దోసిట దూసి.. 
విసిరేను నీ ముంగిలిలో 
తారలనే దివ్వెలు చేసి.. 
వెలిగింతు నీ కన్నులలో 
నీవే నా జీవనాడిగా...ఆ..ఆ 
నీవే నా జీవనాడిగా.. 
ఎగిసేను గగనాల అంచులలో.. 
ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే.. 
నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ 
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల చినుకులలో..ఓ 
చరణం 2: 
ఉరికే సెలయేరులన్నీ... 
వొదిగిపోవు నీ నడకలలో 
ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ.. 
ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ.. 
ధ్యానించు నా మధుర భావనలో..
ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే.. 
ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ
చిరునవ్వుల తొలకరిలో.. 
సిరిమల్లెల చినుకులలో..ఓ
ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ..
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల  చినుకులలో..
చిరునవ్వుల తొలకరిలో.. 
గిరి మల్లెల  చినుకులలో..ఓ
పాటల ధనుస్సు

 
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి