RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, మే 2022, గురువారం

మనసంతా మంగళవాద్యాలే | Manasantha Mangala Vadyale | Song Lyrics | Puli Bidda (1981)

మనసంతా మంగళవాద్యాలే



చిత్రం :  పులిబిడ్డ (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే


అనురాగ గీతాల సుమమాలలల్లి..

అనుబంధ గంధాలు మన మీద చల్లి..

దేవతలే.. దీవించువేళ.. 


మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే.. 


చరణం 1:


చిగురుటాకుల పందిరిలోన 

చిలకపాప పేరంటంలో

కోయిలమ్మ మేళంపెట్టి 

కొంగు కొంగు ముడిపడుతుంటే... 


ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 

ఆశీర్వదించేనులే ఈ వసంతం

ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 

ఆశీర్వదించేనులే ఈ వసంతం

ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం.. 

ఇక మనకు సొంతం


మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే.. 


చరణం 2:


కలలు పండి గెలలేస్తుంటే.. 

కళ్లు నన్ను నిలవేస్తుంటే

ఇద్దరొకటై గదిలో చేరి.. 

నిద్దర కోసం వెతుకుతు వుంటే...


ఏడేడు అడుగుల సప్తస్వరాలు.. 

నా ముద్దుమురిపాల మధురాక్షరాలు

ఏడేడు అడుగుల సప్తస్వరాలు.. 

నా ముద్దుమురిపాల మధురాక్షరాలు

ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు.. 

ఎన్నోవరాలు


మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు