RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఒక్కరిద్దరుగ మారేది | Okkariddaruga Maredi | Song Lyrics | Alu Magalu (1977)

ఒక్కరిద్దరుగ మారేది



చిత్రం :  ఆలుమగలు (1977)

సంగీతం :  టి.చలపతిరావు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  రామకృష్ణ , సుశీల 



పల్లవి :


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని

ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా... ముగ్గురవ్వాలనీ

అవ్వాలనీ.. అవ్వాలనీ


ఒక్కరిద్దరుగ మారేది ... ఇద్దరు ఒకటవ్వాలని

ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా... ముగ్గురవ్వాలనీ

అవ్వాలనీ.. అవ్వాలనీ



చరణం 1 :


కడలి పొంగులన్నీ..  నీ కదలికలో ఉన్నవి

పడగెత్తే పరువాలే..  నీ పైట దాటుతున్నవీ


నీ నవ్వుల పువ్వులలో..  నవ వసంతమున్నదీ

నీ నవ్వుల పువ్వులలో..  నవ వసంతమున్నదీ

నీ చూపులలోనే... వలపూ పిలుపూ ఉన్నవీ 


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని

ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగ్గురవ్వాలనీ

అవ్వాలనీ.. అవ్వాలనీ..



చరణం 2 :



నీ సొగసులు ఝుమ్మంటే.. నా ఊపిరి వేడెక్కింది

నే నిన్ను తాకగానే.. ఆ నీలిమబ్బు మెరిసింది


నీ జంటగ నేనుంటే..  నా మనసే ఊగింది

నీ జంటగ నేనుంటే..  నా మనసే ఊగింది

నీ కౌగిలిలో నా కలలే నిజమౌతున్నవీ


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని

ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగ్గురవ్వాలనీ

అవ్వాలనీ.. అవ్వాలనీ..


చరణం 3 :



మరుమల్లెల బాటలో నీ అడుగుల జాడలో

మడుగులొత్తనా ఎదను పరిచి ఈ వేళ


నీవు నేను ఒకటైతే.. ఆకాశం అందింది

నీవు నేను ఒకటైతే.. ఆకాశం అందింది

మన కోసం తానే చుక్కల ముగ్గులు వేసింది



ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని

ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగ్గురవ్వాలనీ

అవ్వాలనీ.. అవ్వాలనీ.. అవ్వాలనీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు