ప్రేమ పుట్టిందా పెర పెర లాడిందా
చిత్రం : శ్రీరామ రక్ష (1978)
రచన : వేటూరి
సంగీతం : T చలపతిరావు
గానం : SP బాలు P సుశీల
పల్లవి :
ప్రేమ పుట్టిందా పెర పెర లాడిందా
రెప రెప లాడకు బుల్లోడా
పిచ్చి రేగిందా గోవిందా
గోపాల గోవిందా
అయ్యో గోవిందా గోపాల
చరణం 1
అహ తస్సాదియ్యా కస్సుమంటూ కన్ను కొట్టావు
బుస్సుమంటూ పడగెత్తి పై పైకొచ్చావు
వెనక్కి తిరిగి చూడగానే ఉలిక్కి పడ్డావు
జావగారి నీరయ్యి ఏరయ్యి జారుకున్నావు
గోపాల గోవిందా గోవిందా గోపాల
ప్రేమ పుట్టిందా పెర పెర లాడిందా
రెప రెప లాడకు బుల్లెమ్మా
పిచ్చి రేగిందా గోవిందా
గోపాల గోవిందా
అయ్యో గోవిందా గోపాల
చరణం 2
అందమంతా ఆరబోసి చూడమన్నావు
నన్నే చూడమన్నావు
చూడబోతే వున్నదంతా దాచుకున్నావు
అంతా దాచుకున్నావు
ముట్టుకుంటే మొగ్గలాగా ముడుచుకు పోయావు
కొత్త చూపు చూసి నన్నే చిత్తు చిత్తు చేసావు
గోపాల గోవిందా గోవిందా గోపాల
చరణం 3
ఇంతచక్కని సోయగాలు ఎవ్వరికిస్తావు
మంచివాడి జంట చూసి పంచి పెడతాను
పంచి పెడతాను .. నేనేగా నీ జంట ... ఆ ..
అక్కడే వుంది తంట..
ఇదిగో వళ్ళు మండిందంటే ...
నీళ్లు చల్లుకోమంటా .. ఆహ ..
నిన్ను ఎత్తుకుంటేనో ..
వళ్ళు దగ్గర పెట్టుకోమంటా
అయితే నీ వళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను
గట్టిగా వాటేసుకుంటాను ...
గుట్టుగా ముద్దెట్టుకుంటాను ...
ప్రేమ పుట్టిందా పెర పెర లాడిందా
ప్రేమ పుట్టిందా పెర పెర లాడిందా
నీకు పెర పెర లాడిందా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి