RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నా మాటే నీ మాటై చదవాలీ | Naa Maate Nee matai | Song Lyrics | Mattilo Manikyam (1971)

నా మాటే నీ మాటై చదవాలీ



చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)

సంగీతం :  సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


నా మాటే నీ మాటై చదవాలీ

నేనంటే నువ్వంటూ రాయాలీ

నా మాటే నీ మాటై చదవాలీ

నేనంటే నువ్వంటూ రాయాలీ


అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ

అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ


చరణం 1:


మట్టిలో రాసిన రాతలు గాలికి 

కొట్టుకుపోతే ఎట్లాగా.. ఎట్లాగా..

మనసున రాసీ మననం చేస్తే 

జీవితమంతా ఉంటాయి.. నిలిచుంటాయి..


ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. 

మనసంతా రాసేస్తా కోకమ్మ


నా మాటే నీ మాటై చదవాలీ

నేనంటే నువ్వంటూ రాయాలీ


పడవ.. కడవ

చిలక.. పలక


చరణం 2:


ఆహా .. ఆహా .. ఓహో ..ఓహో..

కొండలు కోనలు ఏం చదివాయి

కో అంటే అవి కో అంటాయి


హృదయన్నుండి కదిలాయంటే.. 

చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి

ఆ చదువే నేనింకా చదవాలి.. 

ఆ బదులే నీ నుంచి రావాలి...


నా మాటే నీ మాటై చదవాలీ

నేనంటే నువ్వంటూ రాయాలీ

అహహా హా హా హా హా

ఆఆ ఆ ఆ ఆ ఆ

ఒహొహో హో హో హో

ఆఆ ఆ ఆ ఆ ఆ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు