RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, జనవరి 2022, శనివారం

అ అమ్మ ఆ ఆవు | A Amma Aa Aavu | Song Lyrics | Raitu Bidda (1971)

 అ..అమ్మ ఆ..ఆవు 


చిత్రం :  రైతు బిడ్డ (1971)
సంగీతం :  ఎస్. హనుమంతరావు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల  

పల్లవి :     
 
అ... అమ్మ
ఆ... ఆవు 
అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే ఆవు... అది తెలుసుకో నీవు
ఇ... ఇల్లు
ఈ... ఈ... ఈశ్వరుడు
ఆ... ఇంటిని ఇలనూ కాచేదెవడు ... ఈశ్వరుడు..పరమేశ్వరుడు 


చరణం 1 :

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః...  అం అః
క ఖ గ ఘ జ్ఞ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ..
య ర ల వ శ ష స హ ళ...  క్ష 
అ మొదలుకొని... క్ష వరకు
అ మొదలుకొని... క్ష వరకు
మన అక్షరాలు... యాభైయారూ
అక్షరమాల నేర్చుకొని
ఆపై బ్రతుకులు దిద్దుకొని
చక్కని పౌరులు... కావాలీ
మన జాతికి పేరు... తేవాలి    
అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే... ఆవు
అది తెలుసుకో... నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు... పరమేశ్వరుడు 

చరణం 2 :

అందరిదీ ఒకే... కులం
అందరమూ... మానవులం
కండలు పెంచితె సరిపోదు
కావాలయ్యా బుద్ధిబలం ... కావాలయ్యా బుద్ధిబలం   
         
మనభాషలు వేరే ఐనా
మన మతాలు వేరే ఐనా
జీసస్... ఈశ్వర్... అల్లా ...  
ఈశ్వర..  అల్లా తేరేనామ్... సబకో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారామ్ ... పతీత పావన సీతారామ్
ఈశ్వర్ అల్లా తేరేనామ్...  సబ్ కో సన్మతీ దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారామ్... పతీత పావన సీతారామ్

మన భాషలు... వేరే ఐనా
మన మతాలు... వేరే ఐనా
పాలూ పైరూ... ఒకటే
భూమాత అందరికొకటె
భూమాత... అందరికొకటె
పేదా గొప్పా భేదాలు .... పెళ్ళగించుకొని..పోవాలి
పేదా గొప్పా భేదాలు .... పెళ్ళగించుకొని..పోవాలి
గిరిజనుడే... పురజనుడై
గిరిజనుడే పురజనుడై
ధరా చక్రమును తిప్పాలి
ఈ ధరా చక్రమును తిప్పాలి 
ఈ ధరా చక్రమును తిప్పాలి 
అ..అ..అ..అ..అ..అ..అ..అ..
అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే  ఆవు
అది తెలుసుకో నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు... పరమేశ్వరుడు
ఈశ్వరుడు... పరమేశ్వరుడు

- పాటల ధనుస్సు 

1 కామెంట్‌:

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు