RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vinnanule priya kanugonnanu le priya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vinnanule priya kanugonnanu le priya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఆగస్టు 2024, శనివారం

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా | Vinnanule Priya | Song Lyrics | Bandipotu Dongalu (1968)

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా



చిత్రం :  బందిపోటు దొంగలు (1968)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత : సినారె

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల,


పల్లవి:


విన్నానులే ప్రియా 

కనుగొన్నానులే ప్రియా...

విన్నానులే ప్రియా 

కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ 

కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా...


చరణం 1:


ఎదను దాచిన మౌనవీణ 

కదలి మ్రోగెనులే..ఏ..ఏ..

ఎదను దాచిన మౌనవీణ 

కదలి మ్రోగెనులే..

ఆ మధుర రాగాలలో నీవే 

ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే..


విన్నానులే ప్రియా 

కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ 

కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా...


చరణం 2:


వికసించి వెలిగే నీ అందము...

ఒక వేయి రేకుల అరవిందము..

వికసించి వెలిగే నీ అందము...

ఒక వేయి రేకుల అరవిందము


కలకల నవ్వే నీ కళ్ళు.. 

కాముడు దాగిన పొదరిళ్ళు

ఆ నీల నయనాలలో నీవే 

నిండి ఉన్నావులే... 

నిండి ఉన్నావులే..


విన్నానులే ప్రియా.. 

కనుగొన్నానులే ప్రియా..

మిసిమి వయసు గుసగుసలన్నీ 

కొసరి విన్నానులే...ఏ..ఏ..

విన్నానులే ప్రియా...


చరణం 3:


చిరుగాలి వీచెను వింజామర..

గగనాలు వేసెను విరి ఊయల

ఆ..ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

చిరుగాలి వీచెను వింజామర..

గగనాలు వేసెను విరి ఊయల


పల్లకి పంపెను తారకలు 

పందిరి వేసెను చంద్రికలు

ఆ పసిడి పందిళ్ళలో మనకి 

పరిణయమౌనులే... 

పరిణయమౌనులే...


విన్నానులే ప్రియా... 

కనుగొన్నానులే ప్రియా...

మిసిమి వయసు గుసగుసలన్నీ 

కొసరి విన్నానులే...ఏ..ఏ...ఏ...

విన్నానులే ప్రియా... ఆ...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు