RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kanya kumari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kanya kumari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఏప్రిల్ 2026, గురువారం

తొలి సంజెకు తూరుపు ఎరుపు | Toli Sandhyaku Toorupu Erupu | Song Lyrics | Kanya Kumari (1977)

తొలి సంజెకు తూరుపు ఎరుపు


చిత్రం: కన్య కుమారి (1977)

సంగీతం: ఎస్ పి బాలు,

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి : 


తొలి సంజెకు తూరుపు ఎరుపు

మలి సంజెకు పడమర ఎరుపు

తెలియదు నాకు పడమర తూరుపు

తెలిసిందొకటే ఎరుపు.. 

నా చెలియ పెదవి ఎరుపు


తొలి సంజెకు తూరుపు ఎరుపు

మలి సంజెకు పడమర ఎరుపు 


చరణం 1 :


ఇరు సంధ్యల ఇరుకుల నడుమ.. 

మరుమల్లెల వలపే మనది

ఇరు పెదవుల ఎరుపుల నడుమ.. 

చిరునవ్వుల పిలుపే మనది


తొలి సంజెకు తూరుపు ఎరుపు

మలి సంజెకు పడమర ఎరుపు 


చరణం 2 :


సిరివెన్నెలొలుకు  సిగమల్లె తెలుపు

చిరునవ్వులోని మరుమల్లె తెలుపు

తొలిరోజులందు చెలి మోజులందు 

విరజాజులన్ని తెలుపు


అరమూత కనుల నునులేత వలపు

తెర తీసి నాకు తెలుపు

తెనిగించి మనసు తెలుపు


తొలి సంజెకు తూరుపు ఎరుపు

మలి సంజెకు పడమర ఎరుపు 


చరణం 3 :


చెలి కాటుక మబ్బుల వెన్నెల..

తొలి కోరిక మదిలో కోయిల

మన కలయిక సంధ్యారాగం..

ప్రతిరాగం జీవన రాగం


తొలి సంజెకు.. తూరుపు ఎరుపు

మలి సంజెకు.. పడమర ఎరుపు

తెలియదు నాకు పడమర తూరుపు

తెలిసిందొకటే ఎరుపు.. 

నా చెలియ పెదవి ఎరుపు


తొలి సంజెకు.. తూరుపు ఎరుపు

మలి సంజెకు.. పడమర ఎరుపు


- పాటల ధనుస్సు 



23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఇది తొలి పాట ఒక చెలి పాట | Idi Toli pata oka cheli pata | Song Lyrics | Kanyakumari (1977)

ఓహో చెలీ ఓ ఓ నా చెలీ



చిత్రం : కన్య కుమారి (1977) 

సంగీతం : బాలు 

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు 


పల్లవి: 


ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ

ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


చరణం 1: 


ఎదుట నీవు.. ఎదలో నీవు.. 

ఎదిగి ఒదిగి నాతో ఉంటే 

మాటలన్ని పాటలై మధువులొలుకు 

మమతే పాట 

నీలి నీలి నీ కన్నులలో.. 

నీడలైన నా కవితలలో 

నీ చల్లని చరణాలే నిలుపుకున్న 

వలపీ పాట 

పరిమళించు ఆ బంధాలే పరవశించి.. 

పాడనా.. పాడనా..పాడనా 



ఓహో చెలీ.. ఓ ఓ నా చెలీ 

ఇది తొలి పాట.. ఒక చెలి పాట 

వినిపించనా ఈ పూట.. ఆ పాట 


చరణం 2: 


చీకటిలో వాకిట నిలిచి... 

దోసిట సిరిమల్లెలు కొలిచి 


నిదుర కాచి నీకై వేచి... 

నిలువెల్లా కవితలు చేసి 


కదలి కదలి నీవొస్తుంటే...  

కడలి పొంగులనిపిస్తుంటే 


వెన్నెలనై.. నీలో అలనై.. 

నీ వెల్లువకే వేణువునై


పొరలిపొంగు నీ అందాలే 

పరవశించి పాడనా.. ఆహాహా 

పొరలిపొంగు నీ అందాలే 

పరవశించి పాడనా... 

పాడనా... పాడనా 




ఓహో చెలీ.. ఓ.. నా చెలీ 


ఇది తొలి పాట... ఒక చెలి పాట 


వినిపించనా ఈ పూట... ఆ పాట


ఇది తొలి పాట... ఆ...

ఇది తొలి పాట... ఉమ్మ్.. 

ఇది చెలి పాటా...


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు