RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kalasina manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kalasina manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మే 2025, శుక్రవారం

ఒక్క క్షణం ఒక్క క్షణం | Okka Kshanam Okka Kshanam | Song Lyrics | Kalasina Manushulu (1968)

ఒక్క క్షణం ఒక్క క్షణం 



చిత్రం: కలిసిన మనసులు (1968)

సంగీతం: మాస్టర్ వేణు

గీతరచయిత: దేవులపల్లి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఒక్క క్షణం ఒక్క క్షణం

నన్ను పలకరించకు 

నా వైపిటు చూడకు

ఒక్క క్షణం ఒక్క క్షణం


నిన్ను తలచుకోనీ 

నా కన్ను మూసుకోనీ

మోయలేని ఈ హాయిని మోయనీ

ఒక్క క్షణం ఒక్క క్షణం


ఒక్క క్షణం ఒక్క క్షణం

ఆ రెప్పలు వాల్చకూ

అటు ఇటు కదలకు

ఒక్క క్షణం ఒక్క క్షణం


చరణం 1:


ఆ కన్నులలో ఊహల 

అర్ధమేదొ అడగనీ

ఆ కొలనులలో నీడలా 

అదే పనిగ చూడనీయ్


మోయలేని ఈ హాయిని మోయనీ 

ఒక్క క్షణం ఒక్క క్షణం


చరణం 2:


ఆకులతో గాలి ఊసులాడకూడదు

ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు

ఆకులతో గాలి ఊసులాడకూడదు

ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు


మేను మేను తాకగా.. 

మౌనముగా గువ్వలవలే

కొమ్మ పైని మాటాడక 

కునుకు జంట పువ్వుల వలే


మోయలేని ఈ హాయిని మోయనీ 

ఒక్క క్షణం ఒక్క క్షణం


చరణం 3:


మోము పైన ముంగురులు 

ముసరవచ్చునా

మోవి చుట్టు కోరికలు 

మూగవచ్చునా

మోము పైన ముంగురులు 

ముసరవచ్చునా

మోవి చుట్టు కోరికలు 

మూగవచ్చునా


వాగులాగా ఈ సమయం 

సాగిపోవుననే భయం

నాలో నిండిన నీవే 

నాకు చాలు నేటికి


మోయలేని ఈ హాయిని మోయనీ 

ఒక్క క్షణం ఒక్క క్షణం


ఒక్క క్షణం ఆ.. ఆ

ఒక్క క్షణం..ఆ..ఆ

ఒక్క క్షణం ఆ.. ఆ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు