RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kalakalam ide paadanee song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kalakalam ide paadanee song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జూన్ 2023, బుధవారం

కలకాలం ఇదే పాడనీ | Kalakalam Ide Paadanee | Song Lyrics | Captain Krishna (1979)

కలకాలం ఇదే పాడనీ 




చిత్రం: కెప్టెన్ కృష్ణ (1979)

సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...


చరణం 1:

నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివశించనీ...
నీ నయనాలలో నను నివశించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...


చరణం 2:

జన్మ జన్మల నీ హృదయరాణినై 
ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై 
ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా 
నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...
నీడల్లె నీ వెంట నేనుండగా...
బ్రతుకంత నీతోనే పయణించగా...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...


చరణం 3:

ఈ జంటకు తొలిపంట ఈ రూపము...
నా కంటికి వెలుగైన చిరుదీపము...
ఈ జంటకు తొలిపంట ఈ రూపము...
నా కంటికి వెలుగైన చిరుదీపము..
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై...
వెలగాలి కోటి చందమామలై....

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో... నన్నే చూడనీ...

- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు