RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
annadammula sawal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
annadammula sawal లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2024, సోమవారం

నీ రూపమే నా మదిలోన తొలి దీపమే | Neeroopame naa madilona | Song Lyrics | Annadammula Saval (1978)

నీ రూపమే నా మదిలోన తొలి దీపమే



చిత్రం: అన్నదమ్ముల సవాల్ (1978) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: బాలు, సుశీల 



పల్లవి: 


నీ రూపమే నా మదిలోన తొలి దీపమే

మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో

ఇది అపురూపమే

నీ రూపమే నా మదిలోన తొలి దీపమే

మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో

ఇది అపురూపమే

నీ రూపమే.....


చరణం 1:  

ఆశలు లేని నా గుండెలోన
అమృతము కురిసిందిలే
వెన్నల లేని నా జీవితాన
పున్నమి విరిసిందిలే
నీవు నేను తోడు నీడై
నీవు నేను తోడు నీడై
వీడక వుందాములే
వీడక వుందాములే
నీ రూపమే...
నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో
ఇది అపురూపమే
నీ రూపమే....


చరణం 2:  

లేత లేత హృదయంలో
వలపు దాచి వుంచాను
నా వలపు నీకే సొంతమూ
నిన్ను చూసి మురిసాను
నన్ను నేను మరిచాను
నీ పొందు ఎంతో అందము

పాటల ధనుస్సు 



30, జూన్ 2023, శుక్రవారం

నా కోసమే నీవున్నది | Naakosame neevunnadi | Song Lyrics | Annadammula Sawal (1978)

నా కోసమే నీవున్నది



చిత్రం: అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: బాలు



పల్లవి:


హేయ్.. నా కోసమే నీవున్నది..ది..ది..ది..

ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..

మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు

హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...


నా కోసమే నీవున్నది..ది..ది..ది..

ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..

మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు

హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...


చరణం 1:


హ..హ్హ..అడుగు వేయకు రాజహంసలే 

అదిరిపోయేనులే

తిరిగి చూడకు పడుచుగుండెలే 

చెదిరిపోయేనులే

ఆ..హ హ.అడుగు వేయకు రాజ హంసలే 

అదిరిపోయేనులే

తిరిగి చూడకు పడుచుగుండెలే 

చెదిరిపోయేనులే..

వెచ్చని కోరిక నాలో మెరిసీ ...

విసిరేస్తున్నదీ..ఈ..ఈ...


నా కోసమే నీవున్నది ..ది..ది...ది..

ఆకాశమే ఔనన్నది..ది...ది..ది..


చరణం 2:


మొదట చూపిన మూతి విరుపులు...

తుదకు ఏమాయనే...హ..

అలక తొణకగా చినుకు చినుకుగా...

వలపు జల్లాయనే

మొదట చూపిన మూతి విరుపులు...

తుదకు ఏమాయనే

అలక తొణకగా చినుకు చినుకుగా...

వలపు జల్లాయనే

ఆ జల్లున తడిసిన అల్లరి వయసే...

జత నీవన్నదీ..హ...


నా కోసమే నీవున్నది..ది..ది..ది..

ఆకాశమే ఔనన్నదీ..ది..ది..ది..

మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు

హాయ్ మతిపోతున్నదీ...

ఈ..ఈ..ఈ..ఈ..హహ..హా...


పాటల ధనుస్సు  


30, జులై 2022, శనివారం

ఓ పిల్లా చలి చలిగా ఉందే | O Pilla Chaligavunde | Song Lyrics | Annadammula Sawal (1978)

ఓ పిల్లా చలి చలిగా ఉందే



చిత్రం: అన్నదమ్ముల సవాల్ (1978)

సంగీతం: సత్యం

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: బాలు, జానకి  


పల్లవి: 


హ్మ్మ్.. హ్మ్మ్.. లాలలాల..హేహే..జుజుజుజు..

పపపప్ప్పప..పపపా..పపాప్పా

పపపప్ప్పప..పపపా..పపాప్పా


ష్...

నిన్న రాత్రి మెరుపులు..ఉరుములు.. వాన.. చలి

ఒంటరిగా చెట్టుకింద నిల్చున్నాను

ఎవరో భుజం మీద చెయ్యి ఏశారు.. 

దగ్గరగా లాకున్నాడు

తిరిగి చూశాను.. అతనే..అతనే..అతనే


ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 

నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే

కొంటె కోరికా జంట కావాలన్నదే..



చరణం 1 :




ఆ తరవాతా..

ష్...

కళ్ళు చెదరిపోయాయి.. ఒళ్ళు బెదిరిపోయింది

పెదవులు వణికాయి... గుండె దడదడలాడింది

అతను నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు

వద్దు.. వద్దు... వద్దు.. 


తడిసిన నీ ఒళ్ళు.. మెరిసే నీ కళ్ళు

నాలో రేపెను గిలిగింతలేవో...

ముందర నువ్వుంటే.. తొందర పెడుతుంటే

మదిలో మెదిలే పులకింతలెన్నో

ముందున్నది.. విందున్నది అందాల ఈ రేయి



ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 

నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే

కొంటె కోరికా జంట కావాలన్నదే..


చరణం 2 :


ఆ తరవాత

అతను నా నడుమ్మీద చేయ్ ఏశాడు.. 

తన కౌగిట్లో బంధించాడు..

నేను విలవిలలాడిపోయాను.. 

ఉక్కిరిబిక్కిరి అయ్యాను..

అయ్యో..అయ్యో...అయ్యో...



మిసమిసలాడేటి బుగ్గలు చూశానే... 

ముద్దులు ఇవ్వక వదిలేది లేదే

మధువులు చిందేటి పెదవులు చూశానే.. 

తేనెలు దోచాక కదిలేది లేదే

రా ముందుకు.. నా చెంతకు.. 

ఇంకెందుకే సిగ్గు?


ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 

నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే

కొంటె కోరికా జంట కావాలన్నదే..



ఇదంతా నిజమనుకుంటున్నారా...

ఊహు..వట్టి కల...

 it was a sweet dream.


పాటల ధనుస్సు 


29, జులై 2022, శుక్రవారం

గువ్వగూడెక్కే రాజు వేడెక్కే | Guvva Gudekke | Song Lyrics | Annadammula Sawal (1978)

గువ్వగూడెక్కే రాజు వేడెక్కే



చిత్రం: అన్నదమ్ముల సవాల్ (1978) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


అరెరెరే.. గువ్వగూడెక్కే.. 

రాజు మేడెక్కే .. 

కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 

దిగి వస్తే చిన్నదానా... 

నీ సొగసంతా దోచుకోనా 

హే దిగి వస్తే చిన్నదానా... 

నీ సొగసంతా దోచుకోనా 


గువ్వగూడెక్కే.. రాజు మేడెక్కే .. 

కళ్ళు కైపెక్కే..వళ్ళు వేడెక్కే 

ఎగిరొస్తే అందగాడా.. 

నే సగమిస్తా సందెకాడా 

హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. 

నే సగమిస్తా సందెకాడా 


చరణం 1: 


పడుచు పరుపు నలగనన్నదీ.. 

నా పక్కన నువ్వులేకా.. 

మగ సెగలే రగులుతున్నవీ.. 

నీ ఆడ గాలి నన్ను తాకా.. 


ముద్దులేదు పొద్దులు పోకా.. 

నీవు రాకా నిద్దుర రాకా .. హా 

ముద్దు లేక పొద్దులు పోకా.. 

నీవు రాకా నిద్దుర రాకా... 

కరిగింది కంటి కాటుకా.. ఆ... 


గువ్వగూడెక్కే.. రాజు మేడెక్కే .. 

కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 

ఎగిరొస్తే అందగాడా.. 

నే సగమిస్తా సందెకాడా 

ఆహాహాహా.. దిగి వస్తే చిన్నదానా... 

నీ సొగసంతా దోచుకోనా 


చరణం 2: 


పెదవులు తడి ఆరుతున్నవీ.. 

నీ పెదవులతో ఎంగిలి పడకా.. 

వయసు మిడిసి పడుతు ఉన్నదీ.. 

నువ్వు ఒడిసి పట్టు ఒడుపే లేకా.. 


హేయ్.. రేగితే ఆగదు తిక్కా.. 

మబ్బు మీద వెయ్నా పక్కా 

రేగితే ఆగదు తిక్కా.. 

మబ్బు మీద వెయ్నా పక్కా 

రగిలింది కొంటె కోరికా.. ఆ.. హా 


గువ్వగూడెక్కే..  రాజు మేడెక్కే .. 

కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 

దిగి వస్తే చిన్నదానా... 

నీ సొగసంతా దోచుకోనా 

హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. 

నే సగమిస్తా సందెకాడా


పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు