RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
amma annadi oka kammani maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
amma annadi oka kammani maata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2022, శనివారం

అమ్మ అన్నది ఒక కమ్మని మాట | Amma Annadi | Song Lyrics | Bullemma Bullodu (1972)

అమ్మ అన్నది ఒక కమ్మని మాట



చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)

సంగీతం :  సత్యం

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి:


అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అది ఎన్నెన్నో తెలియని మమతలమూట


అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...

మమతలమూట


చరణం 1:


దేవుడే లేడని మనిషున్నాడు

అమ్మేలేదను వాడు అసలే లేడు

దేవుడే లేడని మనిషున్నాడు

అమ్మేలేదను వాడు అసలే లేడు


తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు

తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు

ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు


అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..

మమతలమూట


చరణం 2:


అమ్మంటే అంతులేని సొమ్మురా

అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా


అమ్మ మనసు అమృతమేసుండురా

అమ్మ ఓడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా


అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...

మమతలమూట


చరణం 3:


అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే

అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే

అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే

అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే


అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది

అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది


అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... 

మమతలమూట


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు