RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, అక్టోబర్ 2025, ఆదివారం

చిక్కావు చేతిలో చిలకమ్మా | Chikkavu Chetilo Chilakamma | Song Lyrics | Vichitra Bandham (1972)

చిక్కావు చేతిలో చిలకమ్మా


చిత్రం :  విచిత్ర బంధం (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  కొసరాజు

నేపధ్య గానం :  రామకృష్ణ 


పల్లవి :


చిక్కావు చేతిలో చిలకమ్మా.. 

నీవు  ఎక్కడికీ పోలేవు 

ఆగవమ్మా.. హా.. హా..

చిక్కావు చేతిలో చిలకమ్మా.. 

నీవు ఎక్కడికీ పోలేవు 

ఆగవమ్మా.. హా.. హా..

చిక్కావు చేతిలో చిలకమ్మా.. 


చరణం 1 :


నీ కోరచూపు చూచి.. 

బెదిరి పోదునా

కస్సు బుస్సు మనగానే.. 

అదిరిపోదునా 


పొగరంతా అణిగిందా.. 

పొగరంతా.. అణిగిందా 

బిగువంతా తగ్గిందా

తప్పు ఒప్పుకుంటావా.. 

చెంపలేసుకుంటావా 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. 

నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా

ఆ.. ఆ.. ఆ.. 

చిక్కావు చేతిలో చిలకమ్మా... 


చరణం 2 :


కల్లబొల్లి మాటలతో 

కైపెక్కిస్తావా

హొయలు వగలు చూపించీ 

వల్లో వేస్తావా


నాటకాలు ఆడేవా 

నాటకాలు ఆడేవా.. 

నవ్వులపాలు చేసేవా...

నీ టక్కులు సాగవమ్మా.. 

నీ పప్పులు ఉడకవమ్మా 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. 

నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా

ఆ... ఆ... ఆ... 

చిక్కావు చేతిలో చిలకమ్మా...


చరణం 3 :


మోసాన్ని మోసంతోటే 

పందె మేసి గెలిచాను

వేషానికి వేషం వేసీ 

ఎదురుదెబ్బ తీశాను


మోసాన్ని మోసం తోటే 

పందె మేసి గెలిచాను

వేషానికి వేషం వేసీ 

ఎదురుదెబ్బ తీశాను


గర్వాన్ని వదిలించీ.. 

గర్వాన్ని వదిలించీ

కళ్ళు బాగా తెరిపించీ.. 

కాళ్ళ బేరానికి నిన్నూ 

రప్పించాను 


చిక్కావు చేతిలో చిలకమ్మా.. 

నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా

ఆ.. ఆ.. ఆ.. 

చిక్కావు చేతిలో చిలకమ్మా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు