RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, అక్టోబర్ 2025, శనివారం

మేడలో చేరిన చిలకమ్మా | Medalo Cherina Chilakamma | Song Lyrics | Naa Pere Bhagavan (1976)

మేడలో చేరిన చిలకమ్మా



చిత్రం: నా పేరే భగవాన్ (1976)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి,

నేపధ్య గానం: బాలు, సుశీల


సాకి : 


పరువాలరెమ్మా.. 

మురిపాల గుమ్మా

పరువున్న ఇంటిలోని.. 

పగడాల బొమ్మా


ఒక మాట.. 

వింటావా ఈ పాట..


పల్లవి:


మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా.. హ హా..

మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా

మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా


మేడలో వున్న చిలకమ్మా ఆ..ఆ..

మేడలో వున్న చిలకమ్మా.. 

మేడలో వుంటేనే ముద్దు

అక్కడే వుంది నీహద్దు.. 

ఎప్పుడూ దాటిపోవద్దు

అక్కడే వుంది నీహద్దు.. 

ఎప్పుడూ దాటిపోవద్దు


మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా


చరణం 1:


నిప్పును దాచాలనుకొంటే.. 

గుప్పిట దాగుతుందా

హా.. గుప్పిట దాగుతుందా..

ఊఁ.. ముంచుకొని వెల్లువ వస్తుంటే.. 

కంచెతో ఆగుతుందా

హా.. కంచెతో ఆగుతుందా


చీకటికి వెల్లవేస్తే.. 

వెలుతురుగా మారుతుందా

మదిని యే మాట దాగుందో.. 

పెదవితో చూపమంటవా

ముసుగులో ఏమి జరిగిందో.. 

అసలుముడి విప్పమంటావా


మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా

మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా


నిప్పులే కాల్చివేస్తున్నా.. 

పట్టుకుంటాను నేను

హా.. పట్టుకుంటాను నేను

వెల్లువే ముంచుకొస్తున్నా.. 

తట్టుకుంటాను నేను

ఊఁ.. తట్టుకుంటాను నేను


మదిలోని ఆ మాట.. 

పెదవిదాటిపోయిందా

హా.. ముద్దుగా వున్న పెదవులకు.. 

మొదటికే మోసం వస్తుంది

నిండుగా వున్న నీ మేను.. 

రెండుగా చీలిపోతుంది


అక్కడే వుంది నీ హద్దు.. 

ఎప్పుడూ దాటిపోవద్దు

మేడలో వున్న చిలకమ్మా.. 

మేడలో వుంటేనే ముద్దు


చరణం 2:


తెల్లని పూలు పూస్తున్నా.. 

ఉల్లి సిరిమల్లె అవుతుందా

ఉల్లి సిరిమల్లె అవుతుందా..

ఎంతగా వన్నె ఒకటైనా.. 

ఇత్తడి పుత్తడి అవుతుందా

ఇత్తడి పుత్తడి అవుతుందా..


ఉరిమిపడే ప్రతిమేఘం.. 

కురిసేనా కురిసేనా

రంకెలకు తుళ్ళి పడిపోయే.. 

జింకను నేననుకొన్నావా

గాలికే తూలిపడిపోయే.. 

బేలను నేననుకొన్నావా


మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే మరిచిందోయమ్మా

మేడలో చేరిన చిలకమ్మా.. 

వాడనే..వాడనే మరిచిందోయమ్మా


సూటిగా చూసినానంటే.. 

సూర్యుడే చల్లబడతాడు

సూర్యుడే చల్లబడతాడు..

చేతులే చాచినానంటే.. 

దేవుడే దిగి దిగి వస్తాడు

హా.. దేవుడే దిగి దిగి వస్తాడు..


పిల్లకాకికేమ్‌ తెలుసు.. అహా.. 

ఉండేలు దెబ్బా

హేయ్‌.. ఛెళ్ళుమని చెంప సవరిస్తే.. 

కళ్ళలో కైపు దిగుతుంది

నెత్తిలో వున్న జేజమ్మ.. 

చిత్తుగా వీగిపోతుంది


అక్కడేవుంది నీహద్దు.. 

ఎప్పుడూ దాటిపోవద్దు

మేడలో వున్న చిలకమ్మా.. 

మేడలో వుంటేనే ముద్దు


చరణం 3:


నాగునై వెంటపడతా..

డేగనై నీ పని పడతా..

చల్లని పిడుగై వస్తా..

పిడుగునే పిండి చేస్తా..

పొగరు చూపిస్తున్నావా..

అయ్యో.. వగలు ఒలికిస్తున్నావా

ముదిరెనా నీ వ్యవహారం..

చూసుకో నా అవతారం..

అరే దీవానా సైతాన్..

ఖబర్ధార్‌ నే నే భగవాన్‌

హ భగవాన్..‌ హా భగవాన్‌.. 

హా భగవాన్‌.. హా హా హా..

ఓ.. భగవాన్..‌ ఆ..ఆ..


మేడలో వున్న చిలకమ్మా.. 

మేడలో వుంటేనే ముద్దు

అక్కడే వుంది నీ హద్దు.. 

ఎప్పుడూ.. హాహా..ఎప్పుడూ.. హై.. 

ఎప్పుడూ.. దాటిపోవద్దు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు