RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2025, ఆదివారం

అన్నయ్య హృదయం దేవాలయం | Annayya Hrudayam Devalayam | SP Balu | Song Lyrics | Bangaru Chellelu (1979)

అన్నయ్య హృదయం దేవాలయం 

చిత్రం : బంగారు చెల్లెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, 


పల్లవి :


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ..

అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అనురాగమే కొలువున్న దైవం

అనుబంధమే గోపురం

మా అనుబంధమే గోపురం


అన్నయ్య హృదయం దేవాలయం..

ఊఁ..ఊఁ..


చరణం 1 :


పంచుకున్నది ఒకటే రక్తం.. 

పెంచుకున్నది ఒకటే పాశం

పంచుకున్నది ఒకటే రక్తం.. 

పెంచుకున్నది ఒకటే పాశం

బ్రతుకున్నది ఆ పాశం కోసం..

బ్రతుకున్నది ఆ పాశం కోసం.. 

కోరుకునేది ఇద్దరి క్షేమం 


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అన్నయ్య హృదయం దేవాలయం.. 

ఊఁ..ఊఁ.


చరణం 2 :


ఊయలలూపి జోలలు పాడే 

తల్లినెరగను..

మోసుకు తిరిగి...  ముచ్చట తీర్చే 

తండ్రినెరగను..

కళ్ళు తెరిచి నే చూచినదే 

ఈ కరుణామూర్తిని

మాట నేర్చి నే పిలిచినదే 

అన్నా అన్నది


అన్నయ్య హృదయం దేవాలయం..


చరణం 3 :


కృష్ణుడు పలికిన గీతవాక్కు.. 

వేదం అయినా ఎందుకు నాకూ..ఊ..

కృష్ణుడు పలికిన గీతవాక్కు.. 

వేదం అయినా ఎందుకు నాకు

నా పాలి వేదం అన్నయ్య పలుకు..

నా పాలి వేదం అన్నయ్య పలుకు..

అన్నయ్య నవ్వే  నా దారి వెలుగు.... 


అన్నయ్య హృదయం దేవాలయం

చెల్లెలే ఆ గుడి మణిదీపం

అనురాగమే కొలువున్న దైవం

అనుబంధమే గోపురం

మా అనుబంధమే గోపురం


అన్నయ్య హృదయం దేవాలయం..

ఊఁ..ఊఁ.. 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు