నీవుండే దా కొండపై
చిత్రం : భాగ్యరేఖ (1957)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దేవులపల్లి
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
నీవుండే దా కొండపై
నా స్వామి.. నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో ..ఓ... ఓ.. ఓ..
ఏ పూల పూజింతునో... ఓ.. ఓ...
చరణం 1 :
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే
ఈ పేదరాలి మనస్సెంతో వేచే
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే
ఈ పేదరాలి మనస్సెంతో వేచే
నీ పాదసేవా మహాభాగ్యమీవా
నాపైనే దయజూపవా నా స్వామీ
నీవుండే దా కొండపై
నా స్వామి.. నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో ..ఓ... ఓ.. ఓ..
ఏ పూల పూజింతునో... ఓ.. ఓ...
చరణం 2:
దూరాన నైనా కనే భాగ్య మీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా
దూరాన నైనా కనే భాగ్య మీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడు కొండలపైనా వీడైన స్వామి
నా పైనే దయజూపవా నా స్వామీ...
నీవుండే దా కొండపై
నా స్వామి.. నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో ..ఓ... ఓ.. ఓ..
ఏ పూల పూజింతునో... ఓ.. ఓ...
- పాటల ధనుస్సు

 
 
 
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి